PM Narendra Modi meets Pak counterpart Nawaz Sharif at Lahore airport, huggs him

Pm modi lands in lahore to meet birthday boy nawaz sharif

Nawaz Sharif, Narendra Modi, Lahore, India, Pakistan, Afghanistan, Atal Bihari Vajpayee, Ashraf Ghani

Indian Prime Minister Narendra Modi landed here on Friday evening on an unscheduled trip from Kabul to New Delhi to meet his Pakistani counterpart Nawaz Sharif.

లాహోర్ లో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మోడీ భేటీ

Posted: 12/25/2015 05:48 PM IST
Pm modi lands in lahore to meet birthday boy nawaz sharif

రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ భారత్ కు తిరగివస్తారనుకుంటున్న సమయంలో భారతీయులందరినీ విస్మయానికి గురిచేశారు. అకస్మికంగా అప్ఘనిస్తాన్ పర్యటనను చేసట్టారు. అ తరువాత మరోమారు ఇండియన్స్ షాక్ ఇచ్చారు మోడి. ఏకంగా దాయాధి దేశం పాకిస్తాన్ కు వెళ్లి.. అక్కడి ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు. ప్రధాని అయ్యాక నరేంద్రమోడీ తొలిసారిగా పాకిస్థాన్ లో పర్యటించారు. అంతకుముందు లాహోర్ విమానాశ్రయంలో ఆయన పలువురు భారతీయులను కలుసుకున్నారు.

ఈ మేరకు ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బర్త్ డే విషెస్ తెలిపేందుకు ఫోన్ చేశానని, షరీఫ్ తో మాట్లాడానని ట్వీట్ చేసిన మోదీ... ఆ వెనువెంటనే ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో భాగంగా పాక్ నగరం లాహోర్ లో ఆగుతున్నట్లు తెలిపారు. లాహోర్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ కానున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అంటే, కేవలం రష్యా పర్యటనకని చెప్పి బయలుదేరిన మోదీ... తిరుగు ప్రయాణంలో ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ లలోనూ పర్యటిస్తున్నట్లైంది.

ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపినట్లుగానే ఏకంగా లాహోర్ విమానాశ్రాయంలో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమానం అగింది. లాహోర్ విమానాశ్రయంలో మోదీకి అ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా స్వాగతం పలికారు. అక్కడ సుమారు రెండు గంటల పాటు ఆయన పాకిస్తాన్ ప్రదాని నవాజ్ షరీష్ తో భేటీ అయ్యారు. నవాజ్ షరీఫ్ కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ నవాజ్ షరీఫ్ మనువరాలి వివాహం కూడా కావడంతో నవాజ్ షరీఫ్ తో కలసి మోడీ వారి నివాసానికి వెళ్లారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ పర్యటన ముగించుకుని అటు నుంచి అటు పాక్ వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది.

రష్యా పర్యటనకని వెళ్లిన ప్రధాని మోడీ, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ లో పర్యటించనున్న విషయాన్ని అటు మోదీతో పాటు అధికారవర్గాలు కూడా చివరి నిమిషం దాకా వెల్లడించలేదు. నిన్న రాత్రి రష్యా పర్యటన ముగించుకుని నేటి ఉదయం ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ లో అడుగుపెట్టేదాకా ఈ విషయం ఎవరికీ తెలియలేదు. భద్రతా కారణాల రీత్యానే మోదీ ఆఫ్ఘాన్ పర్యటనను గోప్యంగా ఉంచినట్లు ఆ తర్వాత అధికార వర్గాలు ప్రకటించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawaz Sharif  Narendra Modi  Lahore  India  Pakistan  Afghanistan  Atal Bihari Vajpayee  Ashraf Ghani  

Other Articles