Arun Jaitley's 10 Crore Lawsuit Against Arvind Kejriwals AAP

Arun jaitley s 10 crore lawsuit against arvind kejriwals aap

AAP, Kejriwal, Arvind Kejriwal, Arun Jaitly, DDCA,Lawsuit , Lawsuit Against Arvind Kejriwals AAP

Arun Jaitley's 10 Crore Lawsuit Against Arvind Kejriwal's AAP. In a packed courtroom, the minister said he "didn't take a single penny' from the DDCA or Delhi and District Cricket Association. His lawyer argued that AAP had caused irreparable damage to his reputation with false allegations.

ఆప్ పై 10 కోట్ల పరువు నష్టం దావా

Posted: 12/21/2015 03:38 PM IST
Arun jaitley s 10 crore lawsuit against arvind kejriwals aap

మొన్నటిదాకా  నేషనల్ హెరాల్డ్ పై  నినాదాలతో దద్దరిల్లిన  పార్లమెంటు నేడు అరుణ్ జైట్లీ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ తో హోరెత్తింది. ఢిల్లీడిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్  అవినీతి వ్యవహారం లో  అరుణ్ జైట్లీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.  రాజ్యసభలోనూ ఈ అంశంపై అల్లరి జరగడంతో  వాయిదా పడింది.  అరుణ్ జైట్లీ  13 ఏళ్లపాటు.. అంటే   2013 వరకూ  డిడిసీఏ చైర్మన్ గా ఉన్నారు. ఈ సంఘంలో అవినీతి పై  జైట్లీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరుతోంది.  

డిడిసిఎ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడినట్లు వస్తున్న వార్తల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన, తన కుటుంబ సభ్యుల మీద ఆప్ పార్టీ చేస్తున్న ఆరోపణల మీద ాయన పాటియాలా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్ తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. క్రికెట్ స్టేడియంలో వీఐపీ బాక్సుల నిర్మాణం ద్వారా రూ.35 కోట్లు సేకరించామని, మైదానం నిర్మాణానికి బీసీసీఐ 4 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో 114 కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ క్రికెట్ స్టేడియం పునర్నిర్మాణం చేపట్టామని వివరించారు. అయితే కాంగ్రెస్ పాలనలోనే అధికంగా నిధులు ఖర్చయ్యాయన్న జైట్లీ, స్టేడియం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 900 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ మీద పది కోట్ల రూపాయల దావా వేశారు అరుణ్ జైట్లీ. అరుణ్ జైట్లీ మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంట్ లో కూడా చర్చిస్తామని కేంద్ర మంత్రి నర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర మంత్రులు జెపి నడ్డా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు అరుణ్ జైట్లీ వెంట కోర్టుకు వచ్చారు. కాగా దీనిపై వచ్చే నెల 5న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Kejriwal  Arvind Kejriwal  Arun Jaitly  DDCA  Lawsuit  Lawsuit Against Arvind Kejriwals AAP  

Other Articles