JC Devakar Reddy wish the old chandrababu naidu

Jc devakar reddy wish the old chandrababu naidu

chandrababu Naidu, JC Devakar Reddy, TDP, Telugudesam party, Chandrababu

JC Devakar Reddy wish the old chandrababu naidu. He said chandrababu naidu present behaviour getting more problems so he asked to old chandrababu Naidu.

పాత చంద్రబాబు రావాలి... లేదంటే కష్టం

Posted: 12/21/2015 04:06 PM IST
Jc devakar reddy wish the old chandrababu naidu

ఆయన మాటలు అంటేనే సంచనం.. ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. చంద్రబాబు మెత్తటి స్వభావాన్ని అవలంభిస్తున్నారన్నారు. అలా కాకుండా పూర్వం మాదిరిగానే బాబు కఠిన వైఖరి అవలంభించాల్సిన అవసరం ఎంతైన ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి తన ఒంట్లో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందన్న జేసీ చంద్రబాబు నాయుడు సమర్ధమైన వ్యక్తి కాబట్టే తాను టీడీపీ లో చేరానన్నారు.  జగన్ పుట్టక ముందే నుంచే కాల్ మనీ ఉందని ఎద్దేవా చేసిన ఎంపీ కాల్ మనీ నింధితులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుందన్నారు.

అంబేద్కర్, కాల్ మనీ మీద చర్చించడానికి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మరికొన్ని రోజులు పొడగించవచ్చు కదా అని ప్రతిపక్ష నాయకుడు జగన్ చేసిన వ్యాఖ్యల మీద కూడా దివాకర్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కోరిన ప్రతిపక్షం ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శించారు. సీఎం మంచి పనులు చేస్తే సంతోషించే రోజులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాల్ మనీ వివాదం చంద్రబాబు నాయుడు, అతడి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలక తావిస్తున్న సమయంలో దివాకర్ రెడ్డి ఇలా పాత చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu Naidu  JC Devakar Reddy  TDP  Telugudesam party  Chandrababu  

Other Articles