Govt hikes excise duty on petrol, diesel to mop up Rs 2.5K-cra

Government raises excise duty on petrol and diesel

excise duty on petrol and diesel, diesel excise duty, petrol excise duty, excise duty news, petrol and diesel excise duty hike, hike in excise duty, india news, india hike in excise duty

Basic excise duty on unbranded petrol has been increased from Rs 7.06 per litre to Rs 7.36 and the same on unbranded diesel from Rs 4.66 to Rs 5.83 per litre

తెలిసేలా.. తగ్గింపులు.. తెలియకుండా వాయింపులు..

Posted: 12/16/2015 07:38 PM IST
Government raises excise duty on petrol and diesel

దేశ వ్యాప్తంగా అన్ని రకాల వాహనదారులకు కేంద్రం శుభవార్తను అందించిన మరుసటి రోజునే వాయింపుల కత్తెరను ప్రయోగించింది. నిన్న వాహనదారులకు అందరికీ తెలిసేలా ఆయిల్ కంపెనీల శుభవార్తను అందించగా, 24 గంటలు కూడా కాకుండానే కేంద్ర ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గిన నేపథ్యంలో భారత్ లో కూడా భారీ స్థాయిలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనావేశారు.

లీటర్ పెట్రోల్ పై 50 పైసలు ధర తగ్గించగా, లీటర్ డీజిల్ పై 46 పైసలు ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో రెండు రూపాయలు చొప్పున ధరలు తగ్గించగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆ మొత్తానికి టాక్సులు వేశాయి. అయితే తాజాగా తగ్గించిన డీజిల్ పెట్రోల్ పై ధరలపై ఒక్క రోజు కూడా గడవకుండానే ఎక్సైజ్ సుంఖాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై రూ.1.17 పెంచాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న రోజుల్లో మళ్లీ నిత్యావసర సరుకుల దరలు పెరగుతాయని.. దాంతో ద్రవ్యోల్భణం కూడా పెరిగే అవకాశాలున్నాయని పలువురు ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో తెలియకుండా కేంద్రం వాయించే వాయింపులు అధికమవుతున్నాయని కూడా వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  global crude prices  excise duty  Direct Taxes  diesel  

Other Articles