This way the call money provided

Call money history and how they got money

call Money, cal money in ap, Chandrababu on call money, call money news, Call money in Vijayawada, Vijayawada, Call Money in AP News

Call Money business in the city took root in the ground prepared by the chit fund business that thrived in the city about two decades ago. Chit fund business came to the city along with several families that migrated from Prakasam district and settled down here mostly in Bhavanipuram and Krishnalanka areas.

‘కాల్ మనీ’కి డబ్బులు ఇలా వచ్చాయి.. పూర్తి స్టోరీ ఇదే

Posted: 12/16/2015 08:20 PM IST
Call money history and how they got money

కాల్ మనీ ఇది కేవలం స్కాం మాత్రమే కాదు.. ఎందరో మహిళల కన్నీటి సాక్ష్యం.. ఎన్నో కుటుంబాల ఆర్తనాధాలు.. ఎంతో మంది బలహీనుల దీనగాధ. ఏపిలో వెలుగులోకి వచ్చిన కాల్ మనీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. కాల్ మనీ అంటే కాలయముల చేతిలో మోసపోయిన వారి కన్నీటి సాక్ష్యం. అవసరాలను తీర్చుకునేందుకు చేసిన అప్పే.. ఎంతో మంది పాలిట ముప్పుగా మారింది. దేశంలో ఎన్నో స్కాంలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఏపిలోఇప్పటి దాకా కనీవినీ ఎరుగని స్థాయిలో మనీతో పాటు.. వ్యభిచారం కూడా ఇందులో చోటుచేసుకుంది. వేల కోట్ల రూపాయల డబ్బులు ఇందులో ఉన్నాయి. ఎక్కడైనా వడ్డీ అంటే ఏదో వందకు నాలుగు లేదంటే ఎక్కువలో ఎక్కువ అంటే పది రూపాయిల దాకా వసూలు చేస్తారు కానీ కాల్ మనీ వ్యవహారంలో మాత్రం అలా కాదు.. వందకు ముప్పై లేదంటే నలభై రూపాయలు వసూలు చేశారు. 

Also Read: కాల్ మనీ కేటుగాళ్లకు చంద్రబాబు అభయం..? 

విజయవాడ కేంద్రంగా సాగిన ఈ కాల్ మనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే వాళ్లు నిజానికి చేస్తున్నది వడ్డీ వ్యాపారమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.  ఎందుకంటే నిజానికి వీరి టార్గెట్ డబ్బులే అయితే వడ్డీ ఎక్కువ తీసుకుంటారు కానీ అలా జగరలేదు. ఎందుకంటే ఆడవాళ్లతో తోలు వ్యాపారం చేయించి మరీ డబ్బులు వసూలు చెయ్యడం ఏంటి..? సరే ఎలాగోలా డబ్బులు తిరిగి వసూలు చేసేందుకే.. వారు ఇలా చేశారా అంటే అదీ కాదు.. డబ్బులు చెల్లించే స్థోమత ఉన్న వాళ్లు తిరిగి చెల్లించడానికి ట్రై చేసినా.. వాళ్లు కావాలనే డబ్బులు తీసుకోకుండా వారిని టార్గెట్ గా చేశారు. 

Also Read: కాల్ మనీ వివాదంపై కదిలిన జనసేన 

తీసుకున్న డబ్బులకు.. కాల్ మనీ నిర్వాహకులు రాయించుకునే బాండ్ కు ఎలాంటి సంబందం ఉండదు. ఎందుకంటే ఐదు లక్షల అప్పు చేస్తే ఏకంగా కోటి రూపాయల ఆస్తులను తనఖాకు ఉంచుకున్నారు. పైగా బాధితులతో తెల్ల కాగితాల మీద, బాండ్ కాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు. కేవలం ఐదు లక్షల రూపాయలకు కోటి రూపాయల విలువైన ఆస్తులను కాల్ మనీ నిర్వాహకులు సొంతం చేసుకున్నారు అంటే తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వ్యాపారానికి నాంది పలికింది రియల్ వ్యాపారులే. వారు చేస్తున్న వడ్డీ వ్యాపారాన్ని విస్తరించి. తిరిగి అలా వచ్చిన వడ్డీతో తమ వ్యాపారాన్ని పెంచుకున్నారు. డబ్బులు చెల్లించలేని వారి ఆస్తులను కొల్లగొడుతూ తెర వెనుక కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించారు. 

Also Read: కోరిక తీరిస్తే... వడ్డీ కట్టేందుకు గడువు పెంచుతాడట..! 

కాల్ మనీలో ఎవరైనా డబ్బులను పెట్టుబడిగా పెట్టవచ్చు. కాల్ మనీలో చాలా మంది బడా నాయకులు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టారు. అలా కాల్ మనీలో డబ్బులు పెట్టిన వారికి పది రూపాయిల వడ్డీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కరెక్ట్ టైంలో చెల్లించేస్తున్నారు నిర్వాహకులు. ఇలా విచ్చల విడిగా వచ్చిన పెట్టుబడితో తక్కువ టైంలోనే కోట్ల బిజినెస్ గా మారింది... కాల్ మనీ. అయితే ఇలా కాల్ మనీ విస్తరించి.. మామూలు జనాల మీద పగడ విప్పి.. బుసలు కొట్టింది. ఈ కాల్ మనీ కాటుకు ఎంతో మంది బలయ్యారు. తాజాగా పోలీసులు ముమ్మరంగా కేసును విచారిస్తుండటంతో కాల్ మనీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్ మనీ నిర్వాహకుల ఆగడాలకు ఇప్పటికైనా కళ్లెంపడుతుందని ఆశిస్తున్నారు. మరి అది నిజంగా జరగుతుందా లేదంటే.. భ్రమగానే మిగులుతుందా చూడాలి. 

Also Read: చంద్రబాబుకు బ్యాడ్ టైం.. కారణం అదే 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles