Richmond man arrested for ‘upskirting’ woman in Willow Lawn

Man arrested for upskirting woman in willow lawn

Richmond man, Willow Lawn, picture up the skirt, underage girl, Henrico police, Jonathan Terry Hanning, A. C. Moore, Hanning, unlawful filming., upskirting crimes, Staples, Hallmark, Crime and Justice, Henrico County, Richmond

A Richmond man is accused of trying to take a picture up the skirt of an underage girl at a store in Willow Lawn.

యువతులు.. మహిళలూ షాపింగ్ చేసేప్పుడు తస్మాత్ జాగ్రత్తా..

Posted: 12/12/2015 04:20 PM IST
Man arrested for upskirting woman in willow lawn

షాపింగ్‌కు వెళ్లినప్పుడు అప్రమత్తంగా లేకపోతే ఏం జరుగుతుందో తెలియందైతే కాదు. సాక్షాత్తు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ షాఫింగ్ చేసి ట్రయల్ రూమ్ లోకి వెళ్లగానే అక్కడ అమె రహస్య కెమెరాను కనుగొనింది. అయితే అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసు తరువాత ఏం జరిగిందన్న విషయాన్ని పక్కన బెడితే.. ఇలాంటి కామమృగాలు అనేక చోట్ల పొంచి వున్నాయి. కేవలం గార్మెంట్స్ షాపుల్లోని ట్రయల్ రూమ్ లనే కాదు.. ఎక్కడ పడితే అక్కడ దారుణాలకు పాల్పడుతున్నారు. ఊహకే అర్థం కాని ప్రాంతాల్లో కూడా దారుణాలకు పాల్పడి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుంటారు. ఈ ఘటన మీకు అదే తెలియజేస్తుంది.

అమెరికా రిచ్‌మండ్‌లో షాపింగ్‌ కోసం ఓ సూపర్ బజార్‌కు వెళ్లిన యువతి దేన్నో తీక్షణంగా గమనిస్తూ పరధ్యానంలో ఉండిపోయింది. దీన్ని అదనుగా తీసుకున్న ఓ కామపిశాచి తన సెల్‌ఫోన్‌తో ఆమె స్కర్ట్ కింద నుంచి ఫొటోలు తీసుకున్నాడు. ఆమె రెండు కాళ్ల మధ్యలో సెల్‌ఫోన్ ఉంచి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రెండు సార్లు కోణాలు మార్చి సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకున్నాడు. ఆ యువతికి అప్పటికి కూడా అనుమానం రాలేదు. అందుకనే అమె తన షాపింగ్ ముగించుకుని వెళ్లిపోయింది.

అయితే శాడిస్ట్ చేసిన తతంగమంతా సిసిటీవీల్లో రికార్డు కావడంతో సదరు షాపింగ్ మాల్ ఓనర్ నిందితుడు జోనథెన్ టెర్రి హాన్నింగ్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడిని పట్టుకున్న పోలీసులు అంతకు ముందే అతడిపై ఇలాంటి తరహా కేసులు రెండు నమోదయ్యాయని చెప్పారు. స్టేపిల్స్, హాల్ మార్క్ పట్టణాలు ఈ కేసులు నమోదయ్యాయని, దీంతో అతడిని దుకాణంలో వెళ్లనీయకుండా కూడా ఆంక్షలు పెట్టామని తెలిపారు. ఇతరుల శరీర భాగాలను, శృంగారాన్ని రహస్యంగా చూసే జబ్బు ఉన్నవాళ్లే ఇలాంటి పనులు చేస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు. షాపింగ్‌కోసం వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని యువతులకు సూచిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Crime and Justice  Henrico County  Richmond  

Other Articles