Rape victim whose teeth were ripped out with pliers by evil beast shares photo of horrific injuries

Donald jeffrey repeatedly raped lover and ripped her teeth out

Donald Jeffrey, Amber, brutal beatings, repeatedly rape torture, Domestic violence, Facebook, Sex crime, Glasgow, Courts, rape, crime, sadist rapist in glasgow, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women,

A man who repeatedly raped his girlfriend and used pliers to rip out her teeth has been jailed for 10 years. Donald Jeffrey was convicted of a total of 13 charges.

శాడిస్టు రేపిస్టు.. ప్రేయసిపై ఇలా కసి తీర్చుకున్నాడు..

Posted: 12/12/2015 01:53 PM IST
Donald jeffrey repeatedly raped lover and ripped her teeth out

తన ప్రేయసిని ఓ అపార్ట్‌మెంట్‌ 17వ ఫ్లోర్‌లోని గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టాడు ఓ శాడిస్ట్‌. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి.. అప్పటికీ కసి తీరక పట్టుకారుతో ఆమె పళ్లు బలవంతంగా పీకేశాడు. తర్వాత ‘స్మైల్‌ ప్లీజ్‌’ అంటూ ఫోటో తీసి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. సంవత్సరాల పాటు ఇలా మనోవేదన అనుభవించిన అమె ఒకరోజు శాడిస్టు పడుకున్నప్పుడు అక్కడ్నుంచి తప్పించుకుని పోలీసులకు చెప్పడంతో అతని బాగోతం బైట పడింది. అతనిపై ఇంతకుముందే ఇలాంటి కేసులు దాదాపు డజను ఉన్నాయి. దీంతో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

గ్లాస్గోకు చెందిన డొనాల్డ్‌ జెఫ్రీ (44) కొద్ది రోజులుగా తన గాళ్‌ ఫ్రెండ్‌ అంబర్ తో కలిసి ఉంటున్నాడు. అయితే డొనాల్డ్‌ కొన్ని సంవత్సరాలుగా అంబర్ పై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. చిత్ర హింసలకు గురి చేస్తున్నా.. ఆ విషయం మాత్రం ఎవరికీ తెలీదు. ఆమెపై పలుమార్లు హత్యాచారం చేశాడు. అనంతరం బలవంతంగా పట్టుకారుతో ఆమె ముందు వరస పళ్లు పీకేశాడు. అలాగే ఆమె కాళ్ల మీద, తల మీద వ్యాయామం చేసే డంబెల్స్‌తో రక్తం వచ్చే వరకు కొట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడ్నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే అంతకు ముందే జెఫ్రీపై కొన్ని కేసులు నమోదయ్యాయి. గర్భవతి అయిన తన మాజీ గాళ్‌ ఫ్రెండ్‌పై హత్యాయత్నం కేసు కూడా ఉంది. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో చేతి మీద వీపు మీద కొట్టడమే కాకుండా.. ఎనిమిదో ఫ్లోర్‌ నుంచి కిందకు తోసేస్తాను అని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో ఆమె కూడా జెఫ్రీపై కేసు పెట్టింది. ఇలాంటి సెక్స్‌ అఫెండర్స్‌ కేసులు ఇప్పటి వరకు జెఫ్రీపై 11 ఉన్నాయి. వీటన్నింటినీ ఓకేసారి విచారణకు తీసుకున్న కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Domestic violence  Facebook  Sex crime  Glasgow  Courts  

Other Articles