Women in Saudi Arabia voting for first time

Women in saudi arabia voting for first time

Saudi Arebia, Women, Voting, Voters, Women voting, Female candidate

Women are also standing as candidates, another first, despite the conservative kingdom being the only nation where women are not allowed to drive.A total of 978 women have registered as candidates, alongside 5,938 men. Female candidates have had to speak behind a partition during campaign appearances or be represented by a man.

సౌదీలో మహిళలకు ఓటు.. ఇదో రికార్డ్

Posted: 12/12/2015 01:36 PM IST
Women in saudi arabia voting for first time

సౌదీ అరేబియా దేశ చరిత్ర లో మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో ఆడవారు పోటీ చేయనున్నారు, మొదటి సారి ఓటు వేయనున్నారు.  ఈ హక్కును మహిళలకు ఇచ్చిన దేశంగా ప్రపంచంలోనే చివరి స్ధానంలో నిలిచింది సౌదీ. ఈ ఎన్నికల్లో మహిళలు కూడా అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 978 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారు. సంప్రదాయ సౌదీ అరేబియాలో మహిళలు ఓటు హక్కును వినియోగించుకోవడం చర్రితలో ఇదే ప్రథమం. సుమారు లక్షా 30వేల మంది మహిళలు ఓటును రిజిస్టర్ చేసుకున్నారు. పురుష ఓటర్లు సుమారు 11 లక్షలు ఉన్నారు.

సాధారణంగా సౌదీలో ఎన్నికలు జరగవు. సౌదీలో ఇవాళ జరుగుతున్న ఎన్నికలు ఆ దేశ చరిత్రలో మూడోసారి మాత్రమే. దివంగత సౌదీ రాజు అబ్దుల్లా మహిళలకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆయన తుది శ్వాస విడవకముందు సుమారు 30 మంది మహిళలకు ఉన్నత పదవులు కట్టబెట్టారు. షురా మండలిలో సుమారు 2100 సీట్లు ఉంటాయి. వాటి కోసమే నేడు సౌదీలో ఎన్నికలు జరగనున్నాయి. మరో 1050 సీట్లను సౌదీ రాజు నియమిస్తారు.

అయితే, సౌదీ లో మహిళలు కారు నడపకూడదు. ఎక్కడికి వెళ్లినా మగ తోడు వుండాలి, అలాంటిది అందరికీ ఎదురెళ్లి ఎలెక్షన్లలో ఓటు వేయడానికి ఎలా వెళ్లగలరు? దీనికి పరిష్కారం తెచ్చింది ఆన్ లైన్ టాక్సీ సేవలు అందిస్తున్న ఊబర్. ఈ రోజున ఓటు వేయడానికి వెళుతున్న మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.  ఏ ఇబ్బంది లేకుండా మహిళలు ఈ ఎన్నికలలో పాల్గొనడానికి ఈ ప్రణాళిక రూపొందించామని నిర్వాహకులు తెలుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Arebia  Women  Voting  Voters  Women voting  Female candidate  

Other Articles