Ragini Dwivedi booked for not returning advance

Producer files complaint against actress

Kannada actor Ragini Dwivedi, Ragini Dwivedi brother, Ragini Dwivedi booked, Ragini Dwivedi advance money, Ragini Dwivedi film producer, Ragini Dwivedi venkatesh, Ragini Dwivedi nati koli, sandal wood news

Kannada actor Ragini Dwivedi and her brother have been booked for reportedly failing to return the advance money they received from a film producer.

ఆ హీరోయిన్ పై కేసు పెట్టిన వెంకటేష్.. ఎందుకు..?

Posted: 12/09/2015 09:37 AM IST
Producer files complaint against actress

తెలుగు ప్రేక్షకులకు హీరో నానితో కలసి నటించిన హీరోయిన్ గుర్తుందా..?  ఏ సినిమాలో అనే మీ ప్రశకు అవకాశం లేకుండా పూర్తి డీటైల్స్ అందిస్తున్నాం. హీరో నాని సరసన 'జెండాపై కపిరాజు' చిత్రంలో నటించిన రాగిణి ద్వివేదీ గుర్తందా..? చాలా మటుటకు గుర్తు పట్టేలేక పోతున్నారు. అవునవును. బాక్సీఫీసు వద్ద బోర్లా పడిన చిత్రాలను, ఆ చిత్ర నటీనటులను ఎవరు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అదీ కాక సినిమా అంతగా బాగోలేదన్న బొలడెంత మౌత్ పబ్లిసిటీ వచ్చిన ఈ చిత్రాన్ని ఎవరు మాత్రం చూసేందుకు సాహసిస్తారు. అందుకనే చాలా మందికి రాగిని గురించి తెలియదు.

అయితే ఈ అమ్మడు మాత్రం సాండిల్ వుడ్ లో ఒక రేంజ్ లో వెలిగిపోతోంది. దీనికి తోడు అసలు భయం బెనుకు లేకుండా ముక్కుసూటిగా మాట్లాడటంతో అమెకు అవకాశాలు అలానే వస్తున్నాయి. కాగా నోటి దురుసని కొందరు అమెపై వెనుక విమర్శలు చేసినా.. అమె పెద్దగా పట్టించుకోదు. అలాంటిది అమెపై ఓ వ్యక్తి నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా రాగిని ద్వివేది సహ అమె సోదరుడిపై బెంగళూరు పరిధిలోని జేపీ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశాడు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 'నాటికోలి' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న వెంకటేష్ అనే నిర్మాత ఈ ఫిర్యాదు చేశారు. తన చిత్రంలో యాక్ట్ చేసేందుకు రాగిణితో ఒప్పందం కుదుర్చుకుని, ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్ కు రూ. 17 లక్షల వరకూ చెల్లించానని, కొన్ని కారణాల వల్ల సినిమా నిర్మాణం ఆగిపోగా, ఇంతవరకూ ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని ఆ నిర్మాత ఫిర్యాదు చేశాడు. ఎన్నోమార్లు డబ్బు కోసం ఆడుగగా, మరో సినిమాలో నటిస్తానే తప్ప డబ్బిచ్చేది లేదని ఆమె చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు. వెంకటేష్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ragini Dwivedi  venkatesh  nati koli  sandal wood news  

Other Articles