muthaiah turns as psycho,injures two of his villagers with arrow

Arrow psycho comes on screen after injwction psycho

injection psycho, siranji psycho, arrow psycho, muthaiah, psycho Telangana, psycho Andhra pradesh, East Godavari, chinturu, vefithota, AP police, Telangana police

After siranji psycho east godavari people face known person muthaiah who turns as psycho. he injured two of his villagers with arrow

పోలీసులకు మరో సవాల్.. సూదిగాడి తరువాత తెరపైకి బాణాల సైకోగాడు..!

Posted: 12/09/2015 10:12 AM IST
Arrow psycho comes on screen after injwction psycho

తెలుగు రాష్ట్రాల పోలీసులకు.. సైకోలు సవాల్ మీద సవాల్ విసురుతున్నారు. అయితే వారు ఎంత మంది.. ఎక్కడెక్కడ సంచరిస్తున్నారన్న వివరాలను తెలుసుకోవడం తప్ప.. నిజంగా ఇతనే సైకో.. అతడ్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పినా.. మరో చోట సైకో దాడులు చేస్తూనే వున్నాడు. మొన్నటిదాకా సైకో సూదిగాడు తెలుగు రాష్ట్రాలను హడలెత్తించి.. మహిళలు పిల్లలను భయాందోళనకు గురి చేశారు.. మెరుపు వేగంతో రోడ్డుపై ప్రత్యక్షమయ్యే సిరంజీ దాడి చేసి క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యేవాడు. సైకోలన్న అనుమానంతో ఎంతమందిని పట్టుకున్నారో పోలీసులకే తెలియాలి. అయితే ఇంతకీ నిజమైన సైకో దోరికాడా లేదనా అన్న ప్రశ్న తెలుగు రాష్ట్ర ప్రజల్లో తలెత్తుతున్న సమయంలోనే తాజాగా మరో సైకో తెరపైకి వచ్చాడు.

తూర్పుగోదావరి జిల్లాలోనే తాజాగా మరో సైకో రంగప్రవేశం చేశాడు. జిల్లాలోని చింతూరు మండలం వేగితోటకు చెందిన 30 ఏళ్ల ముత్తయ్య విల్లంబులు చేతబట్టి రోడ్లపైకి వస్తున్నాడు. కనిపించిన వారిపై బాణాలు ఎక్కుపెడుతున్నాడు. మొన్నటిదాకా బాగానే ఉన్న ముత్తయ్య ఇటీవల పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడట. ఈ క్రమంలో విల్లంబులు తీసుకుని గ్రామానికి చెందిన ఓ ఇద్దరిపై బాణాలు సంధించాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితులనిద్దరినీ స్థానికులు భద్రాచంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని బంధించేందుకు రంగంలోకి దిగారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : injection psycho  siranji psycho  arrow psycho  muthaiah  

Other Articles