Not scared I am Indira’s daughter in law says Sonia

Not scared i am indira s daughter in law says sonia

Sonia Gandhi, Rahul Gandhi, national Herald, Modi, NDA, UPA, venkiah Naidu,Rahul Gandhu on National Herald case, Sonia Gandhi on National Herald case

A Delhi court granted on Tuesday temporary relief to Congress president Sonia Gandhi and her son, Rahul Gandhi, saying they would have to personally appear before it on December 19 to face charges of financial irregularities in case that has paralysed Parliament.

ITEMVIDEOS: ఇందిరాగాంధీ కోడలిని.. దేనికీ భయపడను

Posted: 12/08/2015 06:19 PM IST
Not scared i am indira s daughter in law says sonia

నేషనల్ హెరాల్డ్ కేసు వివాదం సోనియాగాంధీ, రాహుల్ గాందీలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కుదిబండగా మారిన నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు కోర్టు ముందు హాజరుకావాలన్న కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు రాజకీయ పర్యటనలు చేశారు. అయితే దీని మీద సోనియాగాంధీని ప్రశ్నించగా.. తాను ఇందిరాగాంధీ కోడలినని. తాను దేనికే భయపడనని వివరించారు.

ఇక రాహుల్ గాంధీ కేసు మోదీ ప్రభుత్వం తన మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వీటిని ఎలా ఎదర్కోవాలో తనకు తెలుసునని రాహుల్ గాంధీ వివరించారు. కేసుల పేరుతో తనను బెదిరించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని కానీ తాను మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించి తీరుతానని వెల్లడించారు.

నేషనల్ హెరాల్డ్ కేసు నమోదు చేయడం కుట్రపూరితం అని కాంగ్రెస్ నేతలు వాదించడంపట్ల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. అసలు ఈ కేసు నమోదైంది 2013లో అని వివరించారు. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదన్నారు. అలాంటి కేసును తాము కక్ష సాధింపుగా నమోదు చేశామని అనడం ఎంత వరకు సమంజసమన్నారు. సభకు నోటీసులు ఇవ్వకుండా మాట్లాడటం సభాసాంప్రదాయలకు విరుద్దమన్నారు. బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రతీ పనిని కాంగ్రెస్ నేతలు వివాదం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles