Sanjay Dutt likely to walk out of jail early March

Sanjay dutt likely to walk out of jail early march

Sanjay dutt, Bollywood, Supreme court, Pune, Erawada Jail,

Jailed Bollywood actor Sanjay Dutt will walk out from the Yerwada Central Jail ‘a free man’ in the first week of March, official sources said on Tuesday. Dutt was convicted for his role in the March 1993 Mumbai serial blasts. He has, however, been out of jail several times on furlough. In September, Maharashtra Governor CV Rao rejected a pardon plea, but Dutt’s lawyers claimed he never applied for any.

మార్చ్ 7న సంజయ్ దత్ విడుదల

Posted: 12/09/2015 08:12 AM IST
Sanjay dutt likely to walk out of jail early march

ఐదు సంవత్సరాల శిక్షా కాలాన్ని అనుభవిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ రానున్న మార్చి 7వ తేదీన జైలు నుంచి విడుదల కానున్నాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న అభియోగాలు రుజువుకావడంతో సంజయ్‌కు టాడా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అప్పటికే కొంతకాలం జైలు జీవితం గడిపి బెయిల్‌పై ఉన్న మున్నాభాయ్ మిగిలిన 42 నెలల శిక్షాకాలం పూర్తైయిన తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చనున్నాడు. దీనిని అనుసరించి వచ్చే మార్చి నెల 7న సంజయ్‌దత్ జైలు జీవితం నుంచి విముక్తి పొందనున్నట్లు అధికారిక సమాచారం.

ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి బెయిల్ రద్దు అవడంతో లొంగిపోయిన సంజయ్‌ను మొదటగా అర్థర్ రోడ్‌లోని సెంట్రల్ జైలుకు తరలించారు. వారం తర్వాత సంజయ్‌ను అధికారులు పుణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. సత్ప్రవర్తన గల ఖైదీగా సంజయ్ జైలులో పేరుతెచ్చుకున్నాడు. మొత్తానికి ఏదో రకంగా ఎంతో కాలంగా కోర్టులు, జైల్ల చుట్టూ తిరుగుతున్న సంజయ్ దత్ కు పూర్తి స్వేచ్ఛ లభించనుంది. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసు నుండి సంజయ్ దత్ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకొని మార్చ్ 7న విడుదల కానున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay dutt  Bollywood  Supreme court  Pune  Erawada Jail  

Other Articles