after major hoonch tragedy in krishna, government bans few brands

Spurious liquor in vijayawada government bans few brands

Illicit Liquor, Hooch, Five dead, Vijayawada, spurious liquor, ban on few liquor brands, AP Government bans few liquor brands, major hoonch tragedy in krishna, government bans few liquor brands, AP Government, ban, few liquor brands

Five persons died and 29 others were hospitalised after consuming spurious liquor at a bar in the city, taking a stern action on this AP Government banned few liquor brands.

ఈ బ్రాండ్ మద్యం తాగారో.. అంతే సంగతులు.. తస్మాత్ జాగ్రత్త..!

Posted: 12/08/2015 11:19 AM IST
Spurious liquor in vijayawada government bans few brands

మజా కోసం మందెస్తారు.. అయితే నిత్యం మజాలో మునిగి తేలే వాళ్లు లేకపోలేరు. అనుకోకుండా దగ్గరి బంధువులు, స్నేహితులో, పరిచయస్థులో కలిస్తే మద్యం సేవిస్తారు. అదే తరహాలో నిన్న కృష్ణా జిల్లా విజయవాడలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెండ్ లో మధ్యం సేవించిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురు కల్తీ మధ్యం కాటుకు బలయ్యారు. దీంతో కల్తీ మధ్యంపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో సత్తనపల్లిలోని మద్యం శాంపిల్స్ పరీక్షలను ఎక్సైజ్ శాఖ చేపట్టింది. అప్పటి వరకు జిల్లాలో మద్యం దుకాణాలన్నింటినీ బంద్ చేయాలని అదేశాలు జారీ చేసింది. ఫలితాలు వచ్చిన తరువాత తిరిగి మధ్యం అమ్మకాలు జరుపుకోవాలని చెప్పంది.

అదే సమయంలో స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లొ మద్యం సేవించి ఆరుగురు మరణించడంతో ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసింది. బార్ లైస్సెన్సీ బాగోతుల శరత్ చంధ్రతో పాటు కావూరి పూర్ణచంద్రశర్మ, కావూరి లక్ష్మీ, కాళీదాసు వెంకటరమణ, రాజపురెడ్డి మాలకోండారెడ్డి, మల్లాది బాలత్రిపుర సుందరి, టి.వెంకటేశ్వర రావు, సున్నా వెంకటేశ్వర రావు, మల్లాది విష్ణులపై కేసు నమోదు చేసింది. అటు కల్తీ మద్యం సరఫరా చేస్తున్న పలు బ్రాండ్లపై నిషేధం విధించింది. ఆఫీసర్స్ ఛాయిస్ బ్యాచ్ 120, రాయల్ స్టాగ్ బ్యాచ్ 26, డైరెక్టర్స్ స్పెషల్ బ్యాచ్ 143, ఓఏబీ బ్యాచ్ 57, ఓల్డ్ టావెర్న్ బ్యాచ్ 77, మెక్ డోవెల్స్ విస్కీ బ్యాచ్ 9, మెక్ డోవెల్స్ బ్రాందీ బ్యాచ్ 232, ఇంపీరియల్ బ్లూ బ్యాచ్ 10, బ్యాగ్ పైపర్ మ్యదంపై నిషేధం విధించింది.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Illicit Liquor  Hooch  Five dead  Vijayawada  AP Government  ban  few liquor brands  

Other Articles