Chennai floods: AIADMK men paste Jaya stickers on flood relief material

Jaya photo on relief packages bahubali reference irk chennaites

chennai floods, chennai rains, floods in chennai, aiadmk,cm j jayalalitha, cm j jayalalithaa sticker, chennai flood news, food material, amma stickers, chennai, Tamilnadu

After the issue was taken up by volunteers on social media, the AIADMK issued a statement promising action against cadre if they are identified.

ఇంత ప్రచార వ్యామోహం తగునా..? అమ్మ జయలలిత..

Posted: 12/06/2015 01:02 PM IST
Jaya photo on relief packages bahubali reference irk chennaites

ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. చుట్ట అంటించుకోడానికి ని్ప్పు అడిగాడట మరోకడు. అలా వుంది తమిళనాడులో అధికార జయలలిత  ప్రభుత్వ తీరు. ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన విపత్తులోనూ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. భారీ వర్షాలకు అల్లాడిన చెన్నైలో బాధిత ప్రజలకు అందజేస్తున్న సహాయక సామాగ్రి అందించడంలో అధికారులు నెమ్మెదిగా స్పందింస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ప్రజలకు సత్వరం నిత్యవసర సరుకులను అందించాల్సిన ప్రభుత్వం.. తమ సీఎం జయలలిత ఫోటో ప్యాకెట్లపై ముద్రించి వుందా లేదా అన్ని చూసుకుంటూ వాటి ముద్రణ కోసం కాలయాపన చేస్తున్నారు.

అంతేకాదు.. స్వచ్ఛంగా ప్రజలకు సాయం చేసేందుకు వచ్చిన సామాన్యులను కూడా బెదిరించి వారి ప్యాకెట్లపై కూడా జయలలిత స్టిక్కర్లను అతికిస్తున్నారు, 'అన్నాడీఎంకే శ్రేణులు మా వాహనాలను నిలిపివేశారు. మమ్మల్ని బెదిరించి బలవంతంగా బాధితులకు అందజేసేందుకు ఉద్దేశించిన బియ్యం బ్యాగులు, ఆహార పొట్లాలపై స్టిక్కర్లు అతికించారు. ఇది దారుణమైన చర్య. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు' అని సంతోష్ అనే వాలంటీర్ తెలిపారు.

ప్రస్తుత విషాద సమయంలోనూ రాజకీయ ప్రయోజనాలకోసం ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటం సరికాదని మరో వాలంటీర్ తెలిపారు. బాధిత ప్రజలకు తీసుకెళ్తున్న సహాయక సామగ్రిపై బలవంతంగా 'అమ్మ'గా పేరొందిన జయలలిత స్టిక్కర్లు ఉండటం తీవ్ర వివాదాన్ని సృష్టించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలు మాత్రం ఇది తమ చర్య కాదని అంటున్నారు. పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఎవరు దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై అన్నాడీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేయనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ నేత తెలిపారు. అయితే ఇప్పటివరకు అలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ అనుచరులు అన్నాడీఎంకే శ్రేణుల చర్యలను తప్పుబడుతూ మరిన్ని ఫొటోలు విడుదలచేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chennai floods  food material  amma stickers  chennai  

Other Articles