Guinness certificate of LPG subsidy transfer handed over to Modi

Guinness world record recognises centre s pahal scheme

Petroleum Minister Dharmendra Pradhan, guinness certificate, Guinness Book of World Record, PAHAL, cash transfer programme, Prime Minister Narendra Modi, LPG subsidised gas,

Union Minister Dharmendra Pradhan presented the certificate received from Guinness Book of World Records in recognition of 'PAHAL' as the largest cash transfer programme in the world to Prime Minister Narendra Modi.

గిన్నీస్ రికార్డు పుటల్లోకి ఎక్కిన పహాల్ పథకం

Posted: 12/06/2015 12:27 PM IST
Guinness world record recognises centre s pahal scheme

కేంద్రం చేపడుతున్న గ్యాస్‌ నగదు బదిలీ పథకం గిన్నిస్‌ రికార్డుల్లో చోటు సంపాదించింది. ప్రపంచంలో అతి విస్తార నగదు బదిలీ కార్యక్రమంగా.. గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు కితాబునిచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన యోగ్యతాపత్రాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చమురుశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ అందించారు. రాయితీ మినహాయించి గ్యాస్‌ ధర వసూలుచేసే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. రాయితీని నేరుగా వినియోగదారు బ్యాంకు ఖాతాలో వేసి, బుకింగ్‌ సమయంలో గ్యాస్‌ మార్కెట్‌ ధరను వసూలు చేస్తోంది. ఈ బృహత కార్యక్రమానికే గిన్నిస్‌ ప్రశంసలు లభించాయి. ఈ పథకం, యూపీఏ-2 హయాంలోనే రూపుదాల్చింది. ‘డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆన్‌ ఎల్‌పీజీ’ (డీబీటీఎల్‌)గా 2013 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. పథకం అమల్లో ఎదురవుతున్న చిక్కులను తొలగించి పెద్దఎత్తున సంస్కరించింది.
 
‘పహల్‌’ (ప్రత్యక్ష హస్తాంతరిత లాభ్‌) పేరిట దేశంలోని 54 జిల్లాల్లో గత ఏడాది నవంబరు 15 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది జనవరి 1 నుంచి దేశమంతటా విస్తరించింది. ‘‘ఎల్‌పీజీ సేవలను 18.19 కోట్ల మంది పొందుతుండగా, గత ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి ఆ సంఖ్య 14.85 కోట్లుగా తేలింది. మిగిలిన మూడు కోట్లకు పైగా నకిలీ, దొంగ గ్యాస్‌ పుస్తకాలు కలిగి ఉన్నట్టు ‘పహల్‌’లో భాగంగా గుర్తించి తొలగించేశాం. వీరిలో గత జూన్‌ 30వ తేదీ నాటికి 12.57 కోట్ల కుటుంబాల పరిధిలో ‘పహల్‌’ అమలు కాగా, ఈ నెల మూడో తేదీ నాటికి ఆ సంఖ్య 14.62 కోట్లకు పెరిగినట్టు గిన్నిస్‌ రికార్డ్సు నిర్ధారించింది’’ అని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సరైన పత్రాలు సమర్పించడం, దొంగ ధ్రువీకరణలను అందించడం ద్వారా లబ్ధి పొందుతున్న 3.45 కోట్ల మందిని గుర్తించి తొలగించడంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో (ఒక వినియోగదారుకి ఏడాదికి 12 సిలిండర్లు చొప్పున) రూ. 14,672 కోట్లకుపైగా ఖజానా ఆదా అయినట్టు శాఖ వర్గాలు తెలిపాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi  Dharmendra Pradhan  guinness record  gas subsidy  

Other Articles