Supreme Courts no to cancellation of bail to Salman Khan

Supreme courts no to cancellation of bail to salman khan

salman Khan, salman Khan case, hit and run case, Salman Khan in court, Salman Khan News, Salman Khan updates, Supreme court

The Supreme Court today yet again refused to entertain a plea seeking cancellation of bail granted to Bollywood superstar Salman Khan by the Bombay High Court in the 2002 hit-and-run case. “The order of Bombay High Court does not require interference,” a bench comprising justices FMI Kalifulla and Amitava Roy said.

సల్మాన్ ఖాన్ కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్ట్

Posted: 12/05/2015 07:45 AM IST
Supreme courts no to cancellation of bail to salman khan

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో ఆయనకు లభించిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ముంబై సెషన్స్ కోర్టు ఈ ఏడాది మే 6న ఐదేండ్ల జైలు శిక్ష విధించగా.. ఆ తీర్పును రద్దుచేస్తూ ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ను రద్దు చేయాలంటూ సల్మాన్ బాడీగార్డ్ రవీంద్రపాటిల్ తల్లి సుశీలాబాయి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే సల్మాన్ ఖాన్కు ఐదేళ్లు జైలు శిక్ష విధించడం సబబేనని, అతను నేరం చేసినట్టు నిరూపితమైందని బాంబే హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ షిండే వాదించినట్టు సమాచారం. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. నిందితుడు సల్మాన్ ఖాన్పై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని, కింది కోర్టు విధించిన శిక్షను అమలు చేయాలని సందీప్ షిండే హైకోర్టును కోరారు. కానీ ప్రస్తుతం కేసు బాంబే హైకోర్టు పరిధిలో విచారణలో ఉన్నదని, దీనిపై తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని జస్టిస్ కలీఫుల్లా, జస్టిస్ అమితవా రాయ్‌తో కూడిన సుప్రీంధర్మాసనం స్పష్టంచేసింది. మొత్తానికి నిన్న సంజయ్ దత్ కు, నేడు సల్మాన్ ఖాన్ కు ఊరట లబిస్తుండటంతో బాలీవుడ్ లో చర్చ సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles