Special status for Telangana state

Special status for telangana state

Telangana, Special Status, Parliament, Vindo Kumar, KCR, telangana govt, Special status for Telangana

MP Vindo Kumar proposed private bill to give special status for the state of Telangana. He propose and explans the reasons to give special status for telangana.

తెలంగాణకు ప్రత్యేక హోదా.. లోక్ సభలో బిల్లు

Posted: 12/05/2015 07:32 AM IST
Special status for telangana state

ఏపికి ప్రత్యేక హోదా మీద గత కొంత కాలంగా చర్చ సాగుతోంది. అయితే తాజాగా తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పిచాలంటూ తెలంగాణ ఎంపీ వినోద్ కుమార్ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. అవును ఏపికి ప్రత్యేక హోదా మీద ఎలాంటి క్లారిటీ రాకున్నా తెలంగాణ ఎంపీ మాత్రం తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాదన చేశారు. ది స్టేట్ ఆఫ్ తెలంగాణ (స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్) బిల్లు - 2015 అనే పేరుతో పిలిచే ఈ బిల్లులో రాష్ర్టానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాలు, తెగల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని, రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సహజ వనరుల సమర్థవినియోగానికి ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రతిపాదించారు. ఇది ప్రైవేటు బిల్లు కాబట్టి రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడినవేనని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను పొందేందుకు అర్హమైనవని కేంద్రం కూడా గుర్తించిందని ఎంపీ వినొద్ కుమార్ వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది అని బిల్లులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 91(4)(2) ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయాన్ని, పన్ను ప్రోత్సాహకాలను అందించాల్సి ఉందని స్పష్టం చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉంది అని సవివరంగా వినోద్ కుమార్ బిల్లును ప్రవేశపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Special Status  Parliament  Vindo Kumar  KCR  telangana govt  Special status for Telangana  

Other Articles