BSNL sends outstanding bill to late President Kalam

Bsnl sends outstanding bill to late president kalam

Abdul Kalam, BSNL, Notices, Abdul Kalam News, BSNL notices to Abdul kalam, Abdul Kalam in Kerala Rastrapati Bhavan

In a rather embarrassing blooper, the government-run Bharat Sanchar Nigam Limited (BSNL) sent a revenue recovery notice to the late president A P J Abdul Kalam for an outstanding telephone bill. The notice dated November 18, 2015, advised the late President to opt for a one-time settlement to clear the long-pending due of Rs 1,029 (phone no 2724800) or face revenue recovery action.

అబ్దుల్ కలాం అప్పు.. ఆస్తుల అమ్మకానికి నోటీసులు..!

Posted: 12/05/2015 09:28 AM IST
Bsnl sends outstanding bill to late president kalam

అబ్దుల్ కలాం అంటే అది కేవలం పేరు కాదు భారత దేశ కీర్తి ప్రతిష్ట. అయితే తాజాగా అబ్దుల్ కలాంకు సంబందించిన ఓ అంశం తెర మీదకు వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా..? అబ్దుల్ కలాం అప్పు.. అవును అబ్దుల్ కలాం అప్పు పడ్డారు. రాష్ట్రపతి హోదాలో ఉండి కూడా కనీసం నాలుగు పుస్తకాలు, బట్టలు తప్ప ఏమీ తెచ్చుకోని మహానుభావుడికి తాజాగా అప్పుల బాధ పట్టుకుంది. దేశానికి ఎనలేని సేవలను అందించిన అబ్దుల్ కలాం మనల్ని వదిలి నాలుగు నెలలు కావస్తోంది.. కానీ ఆయన నింపిన స్పూర్తి మనలో రగులుతోంది.. రగులుతూనే ఉంటుంది. అయితే తాజాగా బిఎస్ఎన్ఎల్ చేసిన నిర్వాకం విమర్శలపాలవుతోంది. అప్పులు చెల్లించాలని అబ్దుల్ కలాం పేరుతో నోటీసులు  జారీ చేసింది. ఒకవేళ అలా కట్టలేని పక్షంలో ఆయన ఆస్తులను జప్తు చేస్తామని బిఎస్ఎన్ఎల్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంతకీ, ఆ సంస్థకు కలాం బకాయిపడ్డ మొత్తమెంతో తెలుసా?... కేవలం .1029 రూపాయలుమాత్రమే. అది కూడా తిరువనంతపురం పర్యటనలో భాగంగా ఆయన కేరళ రాజ్ భవన్ లో రెండు రోజుల పాటు బస చేసిన సందర్భానికి సంబంధించిన బిల్లట. ఇక ఏ తేదీతో నోటీసు జారీ అయ్యిందో తెలుసా?... 18, నవంబరు, 2015 తేదీతో..అంటే కలాం చనిపోయిన నాలుగు నెలలకన్నమాట. బీఎస్ఎన్ఎల్ జారీ చేసిన నోటీసుల విషయం తెలుసుకున్న కేరళ రాజ్ భవన్ వర్గాలు షాక్ కు గురయ్యాయి. దీనిపై మరింత చర్చ జరగకముందే, సదరు బిల్లును తాను చెల్లిస్తానంటూ కేరళ రాజ్ భవన్ ప్రకటించింది. అయినా దేశానికి అంత సేవ చేసిపన అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి ఆస్తులు, అప్పులు అంటూ బిఎస్ఎన్ఎల్ నోటీసులు జారీ చెయ్యడం ఏంటని కొంత మంది మండిపడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ నోటీసులు జారీ ముందు ఎవరికి పంపిస్తున్నారో.. చూసికోనక్కర్లేదా అని మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles