Telugu cinema stars help the chennai

Telugu cinema stars help the chennai

Chennai, Chennai floods, Tollywood, Allu Arjun, NTR, Kalyan Ram, Ravi Teja, Sandeep Kishan, Chennai News, Tollywood support to Chennai

tollywood stars announce some amount to help the Chennai. Hero Allu Arjun, NTR, Kalyan Ram, Ravi Teja, Sandeep Kishan announce some amount.

చెన్నైకి అండగా తెలుగు సినిమా స్టార్స్

Posted: 12/02/2015 07:14 PM IST
Telugu cinema stars help the chennai

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి జనజీవన స్రవంతి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అయితే నిండా మునిగిన చెన్నై కి అండగా తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. తమను ఆదరించిన చెన్నైకి తమ సహాయాన్ని అందిస్తున్నారు. కొంత మంది నేరుగా డబ్బులు సహాయం చేస్తే మరి కొందరు ఆహార పొట్లాల రూపంలో సహాయం చేస్తున్నారు. మొత్తంగా తెలుగు తారా లోకం చెన్నైకి అండగా నిలుస్తోంది. చెన్నైకి సహాయం చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి....

భారీ వర్షాలు, వరదల వల్ల కష్టాలు పడుతున్న చెన్నై వాసులకు సాయం చేయడానికి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. చెన్నై వరద బాధితులకు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 'నా జీవిత తొలి రోజుల్లో 18 ఏళ్లు చెన్నైలో గడిపాను. ఆ నగరం నన్ను హీరోను చేసింది. ఐ లవ్ యూ చెన్నై' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

alluarjun-twitter

ప్రస్తుతం చెన్నై నగరంలో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు, మెగా హీరో వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లుగా అయన తెలిపారు. "చెన్నై నేను పుట్టిన నగరం. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్ను ఎంతగానో కలచివేసింది. నా వంతు సహాయంగా నేను 3 లక్షల రూపాయలను CM రిలీఫ్ ఫండ్ కి పంపిస్తున్నాను. అందరూ తమకు తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను", అని అన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో ప్రస్తుతం చెన్నై మహానగరంలో ప్రత్యక్షంగా కనపడుతోంది. జనజీవనం స్తంభించిపోయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న చెన్నై నగర వాసులకు అండగా నిలవటం అవసరం. చెన్నై నుండి వస్తోన్న చిత్రాలను చూసి చలించిపోయిన నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం గా తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి సహాయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలను, కళ్యాణ్ రామ్ 5 లక్షల రూపాయలను ప్రకటించారు.

" చెన్నైతో మాకు ఉన్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం నుండి నేడు వస్తోన్న చిత్రాలను చూస్తోంటే చాలా బాధ గా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది. సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం ఇది. మా తరపున ఆర్ధిక సహాయాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాం. చెన్నై త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం", అని ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తెలిపారు.

చెన్నై నగరం వరదల తాకిడికి గురై జనజీవనం అస్తవ్యస్తమైన నేపధ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. చెన్నై వరద బాధితులకు 10 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. తమిళనాడు సి.ఎం రిలీఫ్ ఫండ్ కి ఈ విరాళాన్ని అందజేస్తారు.

మరో తెలుగు నటుడు సందీప్ కిషన్ ఐదువేల ఆహారపు పొట్లాలను చెన్నై వరద బాధితులకు పంపినట్టు తెలిపారు. చెన్నైలోని తన ఇంటి నుంచి వీటిని సమకూర్చినట్టు ట్విట్టర్లో తెలిపారు. తమిళనాడు వరద బాధితులను ఆదుకునేందుకు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.

sundeep-kishan-twitter

ఇటీవ‌ల కాలంలో త‌మిళ‌నాడు మొత్తం విస్తృత‌మైన వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రమంతా ప్రజ‌ల తీవ్రమైన ఇబ్బందుల‌కు గురైన విష‌యం తెలిసిందే. దీనికి స్పందించిన మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ రూ.5 ల‌క్షల విరాళం ప్రక‌టించారు. త్వర‌లో త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత గారి సి.య‌మ్ రిలీఫ్ ఫండ్‌‌కి అందించ‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Chennai floods  Tollywood  Allu Arjun  NTR  Kalyan Ram  Ravi Teja  Sandeep Kishan  

Other Articles