Mahamood Ali said Eat beef only in your home

Mahamood ali said eat beef only in your home

Mahamood Ali, Beef Festival, telangana, Beef, OSmania University, Beef Fesstival in Osmania University

Eat beef only in your home said Telangana Deputy cm Mahamood Ali. In Osmania University some student groups getting ready to do beef festival in the university.

పెద్ద కూర మీ ఇంట్లో తినండి: డిప్యూటీ సిఎం మహమూద్ అలీ

Posted: 12/03/2015 10:10 AM IST
Mahamood ali said eat beef only in your home

ఓయులో బీఫ్ ఫెస్టివల్ నిప్పు రాజసింది. దాద్రీలో బీఫ్ తిన్నాడని ఓ ముస్లింను గుర్తు తెలియని వాళ్లు చంపేశారు. అయితే ఈ ఘటనతో పెద్ద దుమారమే రేగింది. దేశవ్యాప్తంగా బీప్ తిన్న వారిని చంపేస్తారా.? అంటూ నిరసనలు వెల్లువెత్తాయి. అయితే బీఫ్ ను నిషేదిస్తూ చాలా రాష్ట్రాలు చట్టాలను కూడా తీసుకురావడంతో వివాదం మరింత ముదిరింది. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటిలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని కొన్ని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఈ నెల పదో తేదీ ఎవరు అడ్డుకున్నా కానీ బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే  దీని మీద తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ మొదటిసారిగా మాట్లాడారు.

Also Read: గోమాంసం’పై సీఎం చేసిన సంచలన వ్యాఖ్యలు 

తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు చోటుచేసుకోలేదు. అయితే తాజాగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఓయులో నిర్వహించనున్న బీఫ్ ఫెస్టివల్ ను వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఫ్ ఫెస్టివల్ ను తాము అడ్డుకుని తీరుతామని ఆయన ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి వివాదమవుతున్న బీఫ్ ఫెస్టివల్ మీద తెలంగాణ డిప్యూటీ సిఎం మహమూద్ అలీ స్పందించారు. బీఫ్ లేదా పోర్క్ ఏదైనా సరే.. మీ ఇళ్లలో లేదంటే షాదీఖానాల్లో తినాలని అంతే కానీ యూనివర్సిటీల్లో కాదని అన్నారు. యూనివర్సిటీల్లో రాజకీయాలు చెయ్యవద్దని మహమూద్ అలీ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles