Congress party shines in Modi area

Congress party shines in modi area

In what is being looked as the litmus test for Gujarat Chief Minister Anandiben Patel, the initial trend of the local body polls in the state show that the ruling BJP is most likely to retain its grip over the municipal corporations.

In what is being looked as the litmus test for Gujarat Chief Minister Anandiben Patel, the initial trend of the local body polls in the state show that the ruling BJP is most likely to retain its grip over the municipal corporations.

మోదీ ఏరియాలో కాంగ్రెస్ రెపరెపలు

Posted: 12/02/2015 06:47 PM IST
Congress party shines in modi area

నరేంద్ర మోదీకి గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా గట్టిగా ఎదురుగాలి వీస్తోంది. దిల్లీ ఎన్నికల నుండి మోదీ చరిష్మా ఎక్కడా చెల్లడం లేదు. తాజాగా మోదీ ఏరియా అయిన గుజరాత్ లో బిజెపి పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ పురపాలక ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ  అనూహ్యంగా దెబ్బతింది.   పట్టణ ప్రాంతాల్లో బీజేపీ పలుకుబడి  బాగున్నా..  గ్రామీణ ప్రాంతాల్లో  కాంగ్రెస్   మెజారిటీ  పంచాయత్ లను గెలుచుకుంది.   పటేళ్ల   రిజర్వేషన్ ఆందోళన పుణ్యమా అని కాంగ్రెస్   31 జిల్లాల్లో  దాదాపు 20 పంచాయత్ లను గెలుచుకుంది. ఎన్నికల్లో   పటేళ్ల ఆందోళన, వారి డిమాండ్లే  ప్రధానాంశంగా తయారయ్యాయి.   

Also Read:  నరేంద్ర మోడీ ప్రభుత్వంపై బాబా రాందేవ్ విమర్శలు..

ఎన్నికల ఫలితాలపై అదే ప్రభావం కన్పించింది.   అహ్మదాబాద్, వడోదర, సూరత్,  రాజ్ కోట్ , జమ్ నగర్, భావనగర్  మున్సిపల్ కార్పొరేషన్లను  బీజేపీ  గెలుచుకుంది.  అయితే గ్రామీణ ప్రాంతాల్లో  పూర్తిగా దెబ్బతింది.  31 జిల్లా పంచాయతీల్లో   కాంగ్రెస్  20  పంచాయత్ లను గెలుచుకుంది.    ఎన్నికలకు ముందు  మొత్తం 31 పంచాయత్ లలో  30  పంచాయత్ లలో బీజేపీయే అధికారంలో ఉండేది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు,  పటేళ్ల ఆందోళన, పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం,  నీటి పారుదల సౌకర్యాల్లో లోపాలు  వంటి ఎన్నో సమస్యలు  బీజేపీ విజయావకాశాలను దెబ్బతీశాయి. మొత్తానికి కారణాలు ఏవైైనా కానీ మోదీకి మాత్రం గుజరాత్ లో కూడా వ్యతిరే్క పవనాలు తీస్తుండటం ఎంత మాత్రం బిజెపికి అనుకూలం కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles