Convicts in Rajiv Gandhi assassination case will remain behind bars, SC rules

Supreme court blocks release of former pm rajiv gandhi s killers

rajiv gandhi case, rajiv gandhi murder case, rajiv gandhi murder news, rajiv gandhi assassination case, india news, rajiv gandhi news, Rajiv gandhi killers, jayalalithaa, tamilnadu, supreme court

The judgment is a setback to J Jayalalithaa’s government in Tamil Nadu which had in February 2014 decided to release all the seven convicts in the case.

రాజీవ్ హంతకులకు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయం ఫైనల్ అన్న సుప్రీం

Posted: 12/02/2015 11:39 AM IST
Supreme court blocks release of former pm rajiv gandhi s killers

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హంతకులను విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కోంటూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్టే విధించింది.  కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే వారి విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చీఫ్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కేంద్రం అనుమతి మేరకే నడుచుకోవాలని చెప్పింది. ఈ విషయంలో సంయమనం పాటించాలని  కోరింది.
 
తమకు విధించిన శిక్షను మాఫీ చేయాలంటూ రాజీవ్ హంతకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు  వెలువరించినా ఈ వివాదం నడుస్తోంది. గతంలో వారిని విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ గాంధీ హత్య అనేది భారతదేశం మీద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని కోరింది. ఆ సందర్భంగా కూడా  సుప్రీం ఇదేలా స్పందిస్తూ దోషుల విడుదలపై స్టే విధించింది.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajiv gandhi killers  jayalalithaa  tamilnadu  supreme court  

Other Articles