mark zuckerberg and wife to donate 99 percent of facebook shares to charity

Zuckerberg vows to daughter he ll donate 99 of his facebook shares

mark zuckerberg, facebook, zuckerberg baby, zuckerberg donate, zuckerberg letter, zuckerberg charity, Mark Zuckerberg, facebook ceo, 99 percent shares to charity, technology news, facebook news

Mark Zuckerberg signed off the rather long letter saying he will give 99% of Facebook shares, currently about $45 billion

కూతురు పుట్టిన శుభవేళా.. జకర్ బర్గ్ ధాతృత్వం..

Posted: 12/02/2015 10:37 AM IST
Zuckerberg vows to daughter he ll donate 99 of his facebook shares

సంపన్నులు చాలా మంది వుంటారు. ఆదాయశాఖ అందని లెక్కలు కూడా చాలానే వుంటాయి. అయితే తమ సంస్థ పేరు కోసం కూసింత డబ్బును వారు ఛారిటీ కోసం వినియోగిస్తున్నారు. మరికోందరు కొంత ఉదారతను చూపించి వారి లాభాల్లో 10 నుంచి 20 శాతం వరకు మరికొందరు పాతిక శాతం వరకు దానం చేయడమో లేక.. ఆ నిధులతో సేవ కార్యక్రమాలు చేయడమో చేస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఢిఫరెంట్. ఎంతలా అంటే.. తనకున్న షేర్లలో ఒక్క శాతం తాను వుంచుకుని.. మిగిలిని 99 శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఆయనే ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకెర్‌బెర్గ్, కూతురు పుట్టిన వేళా ఆయన తన ఆనందాన్ని ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు. తన భార్య ప్రిసిల్లా చాన్ తో కలసి ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకున్న షేర్లలో 99 శాతాన్ని దానం చేసేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తమ కూతురు మాక్సిమాకు రాసిన లేఖలో తెలిపారు. ఆ లేఖను జుకెర్‌బెర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ ప్రపంచాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసేందుకు ఈ దానం చేస్తున్నానన్నాడు. వాటి ప్రస్తుత విలువ దాదాపు రూ. 3 లక్షల కోట్లు.

ఈ ప్రపంచంలోకి తమ కూతురు మాక్స్‌ను స్వాగతించేందుకు భార్య ప్రిసిల్లా, తాను ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. మనుషుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, సమానత్వాన్ని పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు, స్వచ్ఛ ఇంధనాన్ని అభివృద్ధి చేసేందుకు, ప్రజలను అనుసంధానం చేసేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సమానహక్కులు కల్పించేందుకు, వివిధ దేశాల మధ్య అవగాహనను విస్తరించేందుకు ఈ మొత్తం ఉపయోగపడాలని జుకెర్‌బెర్గ్ ఆకాంక్షించాడు. మీ తరం కోసం మా ఆశలు ప్రధానంగా రెండు అంశాల మీద ఉంటాయని, అవి మానవ శక్తి సామర్థ్యాలను పెంపొందించడం, సమానత్వాన్ని ప్రోత్సహించడమని పేర్కోన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mark Zuckerberg  facebook ceo  99 percent shares to charity  

Other Articles