The Sultan of Bruneis Garage for 7000 Vehicles

The sultan of bruneis garage for 7000 vehicles

The Sultan of Brunei, Sultan, Cars, The Sultan of Brunei News, The Sultan of Brunei cars, The Sultan of Brunei Most Expensive Cars

The Sultan of Brunei‘s name regularly appears when the phrase “the world’s most” is used. Whether it relates to his overall wealth, his palaces, or his investments, the Sultan never comes up short. Such ownership comes with an enormous problem (and I don’t mean finding the time to drive them): where to keep them.

అతడి దగ్గర ఉన్న కార్ల సంఖ్య... 7000

Posted: 12/02/2015 01:37 PM IST
The sultan of bruneis garage for 7000 vehicles

కార్ల  షోకు ఉన్న వాళ్ల గురించి ఎంతని చెప్పాలి లెండి. మార్కెట్లోకి కొత్త కారు వస్తే చాలు అది వెంటనే తమ కాంపౌండ్ లో ఉండాలని కోరుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే కార్ల షోకు ఉన్న వారు మహా అయితే పది లేదంటే ఓ డజను కార్లను కొంటే అదే ఎక్కువ  అనిపిస్తుంటుంది. కానీ ఓ పెద్దాయన దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో తెలిస్తే సాక్ అవుతారు. దాదాపుగా ఏడు వేల కార్లు. అవును అక్షరాల ఏడు వేల కార్లు అతడి దగ్గర ఉన్నాయి.  ఇంతకీ ఎవరా మహానుబావుడు అనుకుంటున్నారా..? బ్రూనై రాజు. అవును అతడి కార్ల గురించి మరిన్ని విషయాలు మీ కోసం...

ఈ రాజుకు దాదాపుగా 7000 లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో అన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా అత్యంక ఖరీదైన లగ్జరి కార్ల సంస్థలకు చెందినవే ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీ వారిగా గల కార్లు 604-రోల్స్ రాయిస్ 574-మెర్సిడెస్-బెంజ్ 452-ఫెరారి 382-బెంట్లీ 209-బియమ్‍బ్ల్యూ కార్లు 179-జాగ్వార్ 134-కోయెంగ్‌సెంగ్ 21-ల్యాంబోర్గిని 11-ఆస్టన్ మార్టిన్ కార్లు ఇంకా ఇతర సంస్థలకు చెందిన కార్లు ఉన్నట్లు తెలిసింది . బంగారపు రోల్స్ రాయిస్ ఇతని ఖాతాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన 24 క్యారట్స్ బంగారుతో తయారు చేయబడిన రోల్స్ రాయిస్ కారు కలదు. మరియు రోల్స రాయిస్ వారి సాధారణ కారే కాని దీనిని బంగారంతో పూత పూయించారు. దీని ధర దాదాపుగా 14 మిలియన్ అమెరికన్ డాలర్లు.మరియు మెక్ లారెన్ యఫ్1 మెక్ లారెన్ కు సంస్థకు చెందిన ప్రముఖ అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారు. దీనిని తయారు చేయడానికి దాదాపుగా ఏడు సంవత్సరాల సమయం పట్టింది. ఇటువంటివి ఈ సుల్తాన్ దగ్గర ఎనిమిది కార్లు ఉన్నాయి.

ఫెరారి యఫ్‌యక్స్‌యక్స్ ఇది అత్యధిక పనితీరును కనబరిచే అత్యంత ఖరీదైన స్పోర్ట్స కారుఇది ఫెరారి కార్ల సంస్థ ఇటలీలో 2005 నుండి 2007 వరకు కేవలం 30 కార్లను మాత్రమే తయారు చేసింది. ఇప్పుడు వీటిని చూద్దామనుకున్నా కనపడవు. కాని ఈ అరుదైన కారు సుల్తాన్ ఆప్ బ్రునెయి కార్లలో ఉంది. ఎవరికైన లక్కు ఉండాలి అది సుల్తాన్ ఆఫ్ బ్రునెయి రాజు కి దక్కింది. ఇక ఈ రాజుగారి దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఒక బిలియన్ అనగా 100 కోట్లు అంటే 2000 కోట్ల అమెరికన్ డాలర్లకు సమానం. కనీసం వాటిని లెక్కించడానికే మన జీవితం ముగిసిపోతుందనుకుంటా..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles