Chennai Rains Break Hundred Year Record, Wreak Havoc

Heavy rains batter tamil nadu more downpour forecast

chennai rain, rain chennai, Chennai waterlogging, Chennai floods, chennai rainfall, tamil nadu rain, chennai news, chennai airport, chennai flight services suspended, india news, latest news, india news, rains in chennai

Chennai took such a heavy blow in 1918 which recorded 108.8 centimeters rainfall, highest on record till the recent showers that brought flood like situation in the state capital and stunned the city.

శతాబ్దపు రికార్డును తిరగరాసిన వరుణుడు.. చెన్నై వాసులకు ఇక్కట్లు

Posted: 12/02/2015 09:01 AM IST
Heavy rains batter tamil nadu more downpour forecast

తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు పట్టణాలలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు శతబ్దాం నాటి రికార్డులను తిరగరాసి ప్రజలను ఇక్కట్లుకు గురి చేసింది. చెన్నై నగరంలో 1918లో రికార్డు వర్షపాతం నమోదైంది. అప్పట్లో నగరాన్ని ముంచెత్తిన వరుణుడు ఏకంగా 108.8 సెంటీ మీటర్ల వర్షపాతాన్ని కుమ్మరించాడు. నిన్నటిదాకా అదే చెన్నై నగరంలో కురిసిన అత్యధిక వర్షపాతం. దాదాపుగా వందేళ్ల దాకా మళ్లీ అంతటి వర్షపాతం నమోదు కాలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజులుగా చెన్నైలో కురుస్తున్న భారీ వర్షం మాత్రం వందేళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది.

సోమవారం అర్ధరాత్రి వరకే నగరంలో 119.73 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిన్న కూడా ఎడతెరిపి లేని వర్షం చెన్నైని ముంచెత్తింది. మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం రాత్రికే చెన్నైలో అత్యధిక వర్షపాతం రికార్డు బద్దలు కాగా, వరుణుడు శాంతించేలోగా సరికొత్త రికార్డులు నమోదు కానున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ రికార్డులు చెరిగిపోయే అవకాశాలే లేవన్న వాదన వినిపిస్తోంది. చెన్నైలో పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితతో ఆరా తీసిన ప్రధాని మరిన్ని కేంద్ర బలగాలను పంపుతామని భరోసా ఇచ్చారు. కేంద్రం తమిళనాడు ప్రభుత్వానికి అండగా వుంటుందని హామి ఇచ్చారు.

నెల్లూరు, చిత్తూరులలనూ వరుణ బీభత్సం

ఇటు ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. వర్షం కారణంగా ఈ జిల్లాల్లోని జలాశయాలన్నీ పూర్తిగా నిండటమే కాక పొంగి పొరలుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడురు, వెంకటగిరి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లోని మెజారిటీ పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా పరిధిలోని స్వర్ణముఖి, కైవల్యా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి.

మరో 49 గంటల పాటు వర్షం కురిసే అవకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముంపు ప్రాంతాల్ల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా ఇవాళ విద్య సంస్థలు, పాఠశాలలకు సెలవును ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Chennai rains  Chennai waterlogging  Chennai floods  

Other Articles