CM Chandrababu rides Bullet in Jana Chaitanya Yatra in Guntur

Chandrababu rides bullet in guntur

Chandrababu rides Bullet, Guntur, CM Chandrababu, TDP, TDP Jana Chaitanya Yatra, babu thrills his party men

Andhra Pradesh chief minister Chandrababu thrills his party men in Jana Chaitanya Yatra at Guntur by Riding Bullet

ITEMVIDEOS: బుల్లెట్ నడిపిన ఏపీ ముఖ్యమంత్రి.. పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్..

Posted: 12/01/2015 05:57 PM IST
Chandrababu rides bullet in guntur

సమైక్య రాష్ట్రానికి వరుసగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన నారా చంద్రబాబు నాయుడుకు ఎప్పటి నుంచో ఓ కోరిక వుండేది కాగా, అది కాస్తా కొద్దిమేరకే తీరింది. చంద్రబాబు కు తీరని కోరిక ఏమిటీ అనేగా..? ఆయనకు ఎప్పటి నుంచో బుల్లట్ నడపాలని కోరిక వున్నట్లుంది. అందకనే ఈ రోజున ఆయన సరదాగా బుల్లెట్ నడిపారు. ఆయన వెంట ఆయన వ్యక్తిగత సిబ్బంది, ఇతరాత్రా సిబ్బంది బై్క్ వెంట పరుగులు  తీశారు.

నిత్యం భారీ కాన్వాయ్, నడుమ వెళ్లే చంద్రబాబు కాస్తోకూస్తో దూరమైన ప్రదేశాలు వెళ్లాలంటే.. హెలికాప్టర్లలోనో లేక విమానంలో వెళ్తుంటారు. అలాంటిది ఆయనకు ఇవాళ బైక్ అందులోను బుల్లెట్ నడపాలని సరదా పడ్డారు. అంతే తన ముచ్చటను ఆయన తీర్చుకున్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా నేడు గుంటూరు జిల్లా వేమూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ ను నడిపి టీడీపీ నేతలు, కార్యకర్తల్లో హుషారు నింపారు.

టీడీపీ పాలనపై వ్యతిరేకత వస్తుందని తెలుసుకున్నాడో ఏమో ఈ సర్వే వీరుడు.. చిన్నపిల్లలను ఎత్తుకుని జనాలను ఆనందభరితులను చేశారు. ఆ తరువాత ప్రజా పిర్యాదులను స్వీకరించారు. దీంతో బాబు గారు తాతయ్య అయినప్పటి నుంచి మార్పు వచ్చిందని పలువురు గుసుగుసలాడుతున్నారు. ఇంకోందరు మాత్రం చంద్రబాబు బుల్లెట్ నడపి.. ప్రధాని నరేంద్రమోడీలా పబ్లిసీటీకి, తన పేపర్లో శీర్షక పేజీల్లో కథనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కాగా పార్టీ శ్రేణులు మాత్రం బుల్లెట్ ను నడిపిన ఆరుడుగుల బుల్లెట్ అంటూ కీర్తిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guntur  CM Chandrababu  TDP  TDP Jana Chaitanya  

Other Articles