3 year old rakesh who slipt in borewell hasbeen dead

Three year old boy dies after falling in borewell in medak

borewells, rakesh, bommareddy gudem thanda, dead, medak, borewell, kid dies, child fell in borewell, child die in borewell, medak death, medak child deaad, telandgana death, india news

The boy, Rakesh, fell into the borewell yesterday at around 9 AM while playing near his house at Bommareddi Gudem village in Pulkal mandal of Medak district.

విషాదాంతం: మరో చిన్నారిని మింగేసిన బోరుబావి..

Posted: 11/29/2015 12:19 PM IST
Three year old boy dies after falling in borewell in medak

నిర్లక్ష్యమే పెను శాపమైంది. అభం శుభం తెలియని మరో పసిబిడ్డ బోరుబావి నిర్ధాక్షిణ్యంగా మింగేసింది. పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల రాకేశ్ ను కాపాడేందుకు గత 24 గంటలుగా సాగిన చర్యలు విఫలమయ్యాయి. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో 40 అడుగుల లోతులో బండరాళ్లమధ్య తలకిందులుగా చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ ను జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు వెలికితీశాయి. కాగా, సహాయక చర్యల్లో ఆలస్యమే బాలుడి మరణానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ చిన్నారి ఇక లేడన్న వార్తతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులు, వారి బంధువులు ఆర్థనాథాలో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది.

తనతో అడుకుంటూ సోదరుడు రాకేష్ బోరులో పడిపోయిన విషయం బాలేష్ తన తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్థులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. తాడు, కొక్కాలు వేసి లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సమాచారం అందుకున్న 108 సిబ్బంది  సంఘటన స్థలానికి చేరుకొని బోరుబావిలోకి ఆక్సీజన్ అందించారు. వెల్దుర్తి నుంచి శ్రీనివాస్ అనే యువకుడిని పిలిపించి నైట్ విజన్ కెమెరాలు బోరుబావిలోకి పంపించి రాకేష్ ఉన్న స్థానాన్ని గుర్తించారు. 30 ఫీట్ల లోతులో తలకిందులుగా ఉన్నట్టు, చుట్టూ మట్టి పేరుకుపోయినట్టు నిర్ధారించి. .సహాయక చర్యలు చేపట్టారు. వాటి ద్వారా బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు చేపడుతున్నారు. బండ రాళ్లు అడ్డు పడటంతో ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన భారీ యంత్రాలను సైతం వినియోగించినా చివరికి విషాదాంతమే అయ్యింది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : borewells  rakesh  bommareddy gudem thanda  dead  

Other Articles