suspected pakistani spy arrested in uttar pradesh with sensitive documents

Arrested isi agent deft in use of computer software

ISI Agent arrest, ISI Agent arrested in india, ISI Agent arrested in meerut, ISI Agent with sensitive indian army documents, ISI, Bareilly, arrest, Agent, ISI Agent, Uttar Pradesh, Special Task Force, Indian Army

An ISI agent today has been arrested from Meerut Cantt area by Special Task Force team of Uttar Pradesh, who has some sensitive documents related to Indian Army.

పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు.. భారత అర్మీ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Posted: 11/29/2015 11:37 AM IST
Arrested isi agent deft in use of computer software

ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కీలక పత్రాలతో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఎజెంట్ పట్టుబడ్డాడు. పాకిస్థాన్‌ జాతీయుడైన మహమ్మద్ ఈజాజ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కాంట్ ప్రాంతంలో ఆ రాష్ట్ర స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) అరెస్టు చేసింది. ఇస్లామాబాద్‌లోని ఇర్ఫాన్‌బాద్ తారామడి చౌక్‌కు చెందిన అతను మీరట్‌కాంట్‌ నుంచి ఢిల్లీ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామని ఎస్టీఎఫ్ ఐజీ సుజీత్ పాండే విలేకరులకు తెలిపారు.

భారత ఆర్మీకి సంబంధించిన పత్రాలు, పాకిస్థాన్ గుర్తింపు కార్డు, పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన నకిలీ ఓటర్ కార్డు, బరెల్లీకి చెందిన నకిలీ ఆధార్ కార్డు, మెట్రో ఐడీ కార్డు, లాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌లు అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. భారత సైన్యం కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఓ పాకిస్థానీ పశ్చిమ యూపీకి వచ్చినట్టు నిఘా వర్గాలు సమాచారమిచ్చాయని, ఆ సమాచారం ఆధారంగా ఈజాజ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. భారత ఆర్మీ సమాచారాన్ని సేకరించి పంపేందుకు ఐఎస్‌ఐ సూచన మేరకు 2012లో భారత్‌కు వచ్చానని అతను తమ విచారణలో వెల్లడించడాని ఐజీ పాండే తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISI Agent  Uttar Pradesh  Special Task Force  Indian Army  

Other Articles