They are facing Sleepless nights by cm decision

They are facing sleepless nights by cm decision

Bihar, Nitesh Kumar, Liquior, Ban on Liquior, Liquior Prohibition, Liquior Business men

By the CMs decisions, many business peopls are not getting sleep in the nights. Bihar CM Nitesh Kumar said to prohibite liquior in the state.

ఆ సిఎం మాటలతో వ్యాపారులకు నిద్రలేని రాత్రులు

Posted: 11/28/2015 03:37 PM IST
They are facing sleepless nights by cm decision

పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదే మరి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో చాలా మంది వ్యాపారులు రాత్రులు సరిగ్గా నిద్రపోవడం లేదు. సిఎంగారి నిర్ణయంతో అసలు ఏం చెయ్యాలో అర్థంకాక తికమక పడుతున్నారట. ఇంతకీ ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా..? తాజాగా బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సిఎం పదవిని అందుకున్న నితీష్ కుమార్. నితీష్ కుమార్ నిర్ణయం వల్ల అక్కడి మద్యం వ్యాపారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే..

బిహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే హామీలపై దృష్టి పెట్టిన నితీశ్ కుమార్ రాష్ట్రంలో సంపూర్ణ మధ్యనిషేధం ఫైల్ పై సంతకం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. నితీశ్ ఎన్నికల ప్రధాన హామీల్లో ఇదొకటి. అయితే ఇదే హామీ ఇప్పుడు అక్కడి మద్యం వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. నితీశ్ చేసిన ఈ ప్రకటనతో తమ వ్యాపారాలు ఇక అంతేనంటూ గగ్గోలు పెడుతున్నారు. కొందరైతే కొత్త వ్యాపారాలకు రూట్స్ వెతుక్కుంటున్నారు. బిహార్ లో మొత్తం 5446 బార్లు, రెస్టారెంట్లు, లిక్కర్ షాపులు ఉన్నాయి. వీటిలో 2471 దేశీయ మద్యం అమ్ముతుండగా.. మరో 1434 షాపులు విదేశీ మద్యం అమ్ముతున్నాయి. అయితే ఇప్పుడు వీటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీటిపై ఆధారపడ్డ ఫ్యామిలీలు కూడా చాలా ఉండటంతో ఏం చెయ్యాలో తోచక.. తలలు పట్టుకు కూర్చున్నారు చాలా మంది వ్యాపారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Nitesh Kumar  Liquior  Ban on Liquior  Liquior Prohibition  Liquior Business men  

Other Articles