Haryana Woman Cop Transferred After Heated Exchange With Minister

Haryana woman cop transferred after heated exchange with minister

anil vij, Sangeeta Kalia, Fatehabad police chief transferred, Haryana Health Minister, Haryana woman cop transferred

Police chief of Haryana's Fatehabad district who had a heated exchange with Health Minister Anil Vij during a meeting yesterday has been transferred. Sangeeta Kalia, who was the Superintendent of Police of Fatehabad, has been posted as Commandant of the India Reserve Battalion in Manesar.

మంత్రిగారితో పెట్టుకుంటే.. ఎస్పీఐనా పోస్ట్ ఊస్టింగ్ తప్పదు..!

Posted: 11/28/2015 04:33 PM IST
Haryana woman cop transferred after heated exchange with minister

రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదువా.? అన్నట్లు మంత్రిగారు తలుచుకుంటే ట్రాన్స్ ఫర్, సస్పెండ్ పెద్ద విషయమే కాదు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? తాజాగా హర్యానాలో ఓ మీటింగ్ లో మంత్రితో వాగ్వివాదానికి దిగిన మహిళా పోలీసు ఎస్పీకి మొత్తానికి వేరే చోటికి బదిలీ చేయనున్నారు.  ఫతేహాబాద్ జిల్లా  పోలీసు ఎస్పీ  సంగీత కలియా  ఆరోగ్య శాఖమంత్రి అనిల్ విజ్ తో ఓ సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  ఓ అంశంపై  మంత్రితో వాగ్వాదానికి దిగడంతో  మర్నాడే ఆమెను పదవినుంచి తప్పించారు.  గురెగావ్ లోని భోండ్ సీకి ఆమెను బదిలీ చేస్తారని  హర్యానా రాజకీయవర్గాలవారు తెలిపారు.  జిల్లాలో  ప్రజల సమస్యలు,  పబ్లిక్ రిలేషన్స్ కమిటీ సమావేశంలో మంత్రి  ప్రజాసమస్యలు ఆలకిస్తుండగా   అక్రమ లిక్కర్  అమ్మకాల నిరోధంపై ఓ ప్రశ్నవచ్చింది.  

అక్రమ మద్యం నిరోధానికి ఏం చర్య లు తీసుకున్నారని మంత్రి ప్రశ్నించగా  ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం 2,500 కేసులు బుక్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.   అక్రమ మద్యం మాఫియాను అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకున్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు అని మంత్రి గద్దించడంతో  ఆల్కాహాల్ అమ్మడానికి ప్రభుత్వమేగా మాఫియాకు లైసెన్స్ ఇచ్చింది.. వారే అక్రమ మద్యం అమ్ముతున్నారని ఎస్పీ సమాధానం ఇవ్వడంతో మంత్రి ఆగ్రహానికి గురయ్యారు.  పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. వాదిస్తున్న ఎస్పీని  వెంటనే అక్కడి నుంచి పొమ్మన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles