Mallikarjun Kharge-Narendra Modi warmth, off camera

Mallikarjun kharge narendra modi heat off camera

parliament winter sessions, Mallikarjun Kharge, Narendra Modi, venkaiah naidu, modi kharge, modi kharge shake hand, venkaiah naidu kharge, venkaiah naidu, opposition, mallikarjun kharge, ramkripal yadav, india news, national news

“Kharge ji, aao na, haat milaiye (Mr Kharge, come, let’s shake hands),” he said, as the PM turned and smiled at Kharge. When Kharge hesitated, Naidu repeated his request.

ప్రతిపక్ష నేతతో మా చేతులే కాదు మా డ్రెస్ లు కలిశాయి- మోడీ

Posted: 11/28/2015 03:30 PM IST
Mallikarjun kharge narendra modi heat off camera

ప్రతిపక్ష నేతతో మా చేతులే కాదు మా డ్రెస్ లు కలిశాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఏమిటీ అలోచిస్తున్నారు..? నిజమా..? కాదా..? అనేగా.. ముమ్మాటికీ నిజమేనండీ.. పార్లమెంటులో లోక్ సభ సమావేశాల వాయిదా అనంతరం పార్లమెంటు లాభీల్లో ఏ మీడియా లేనప్పడు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత మాత్రమే ఉన్నప్పుడు ప్రధాని ఈ మాటలు అన్నారు. ఏంటీ ? ఇంకా నమ్మశక్యంగా లేదా..? అయితే పూర్తి వివరం చదవండీ..

శుక్రవారం సభ  పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, వెంకయ్య నాయుడు సహా మరో ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య ఈ సంభాషణ జరిగింది. అంతకుముందు సభ రాజేసిన వేడిని కాస్త చల్లార్చే విధంగా సాగింది. శుక్రవారం సభ ముగిసిన తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ తన ఛాంబర్ లోకి వెళ్లిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దాదాపు 10 నిమిషాలపాటు సెంట్రల్ హాలులోనే ఉండిపోయారు.

వెంకయ్యనాయుడు, రాంకృపాల్ యాదవ్ మోదీ చుట్టూ చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే బయటికి వస్తున్న కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి వెంకయ్యనాయుడు.. 'ఖర్గేజీ.. రండి రండి.. మోదీగారితో ఓసారి చెయ్యికలిపి వెళుదురుగానీ' అన్నారు. తనను కాదనుకుని వెళ్లున్న ఖార్గేను మరోసారి గట్టిగా పిలిచారు వెంకయ్య. దీంతో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు.. ప్రధాని మోదీకి ఫార్మల్గా షేక్హ్యాండ్ ఇచ్చారు.

ఖర్గే భావాలను పసిగట్టిన మరో కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్ మధ్యలో కలగజేసుకుని.. 'ఖర్గేజీ.. మోదీకి అలయ్ భలాయ్ (గలే మిలాయియే)' కూడా ఇవ్వాలంటూ ఉత్సాహపర్చారు. అయితే ఖర్గే మాత్రం ఆ పని చేయకుండా మిన్నకుండిపోయారు. దీంతో అందరి ముఖాల్లో కనిపించీ కనిపించని వెలితి. పరిస్థితిని ప్రశాంతపరుస్తూ 'మా చేతులు కలవడమే కాదు.. మాదుస్తులు కూడా మ్యాచ్ అయ్యాయి' అంటూ మోదీ చలోక్తి విసరడంతో అక్కడ నవ్వులు విరిశాయి. శుక్రవారం మోదీ, ఖర్గే ఇద్దరూ తెలుపు రంగు కుర్తా పైజామాపై క్రీమ్ కలర్ కోటు ధరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament winter sessions  Mallikarjun Kharge  Narendra Modi  venkaiah naidu  

Other Articles