Ringo Now Lets You Make STD and Local Calls in India at Rs. 0.19 per Minute

Ringo app launches local calling at 19 paise min

Ringo app local calling at 19 paise min, android, apps, india, instant messaging, instant messenger, ios, ringo, CEO and Founder of Ringo Bhavin Turakhia,

Ringo company says that using its services, people will be able to make calls across the country - local as well as STD -- at Rs. 0.19 per minute.

రింగో నుంచి భల్ భలే రింగా రింగా ఆఫర్..!

Posted: 11/27/2015 11:55 AM IST
Ringo app launches local calling at 19 paise min

డిస్కౌంట్ ఆఫర్ వుందంటే అవసరం లేకున్నా ఆ వస్తువును కోనుగోలు చేసే నైజం భారతీయులకు అమితంగా వుందని గ్రహించిన అనేక ఈ కామర్స్ సై్లు ఏడాదిలో రెండు నుంచి మూడు పర్యాయాలు ఢిస్కౌంట్ సేల్ ను ప్రవేశపెడుతూ సోమ్ముచేసుకుంటున్నాయి. అయితే సుమారుగా 90 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్న యాప్ గురించి తెలిస్తే.. ఇక భారతీయులు ఊరుకుంటారా. అసలే రమారమి పట్టణవాసులందరి చేతుల్లోనూ స్మార్ ఫోన్ దర్శనమిస్తున్న తరుణంలో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకుండా ఎలా వుంటారు. అయితే ఈ యాప్ దేనిపై డిస్కౌంట్ ఇస్తుందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఇది నిత్యం మనకు అవసరం వచ్చే అప్ కాబట్టి.

వివరాల్లోకి వెళ్తే..తక్కువ ఖర్చుతో ఫోన్‌ కాల్స్‌ మాట్లాడే సదుపాయం కల్పిస్తున్న రింగో అప్లికేషన్‌ తాజాగా 19 పైసలకే నిమిషం పాటు దేశీయంగా కాల్స్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాల్స్‌పై తాము వసూలు చేస్తున్న రేటు టెలికాం కంపెనీలు వసూలు చేస్తున్న చార్జీల కన్నా 90 శాతం తక్కువని ఈ సంస్థ చెబుతోంది. మొబైల్‌ ఫోన్‌ ఆపరేటర్ల నెట్‌వర్క్‌ను ఆధారంగా చేసుకుని ఫోన్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యాన్ని ఈ యాప్‌ అందిస్తోంది. కొత్తగా తెచ్చిన ఈ సదుపాయంతో వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో పది లక్షల మంది కస్టమర్లను సంపాదించుకోవాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది.

టెలికాం కంపెనీల ఎస్‌టిడి చార్జీలు భిన్నంగా ఉంటాయని, తాము మాత్రం దేశంలోని ఏ లాండ్‌లైన్‌కు లేదా మొబైల్‌ ఫోన్‌కు చేసినా ఒకే ధరను వసూలు చేస్తామని రింగో వ్యవస్థాపకుడు, సిఇఒ భవిన్‌ తెరఖియా తెలిపారు. రోమింగ్‌ చార్జీలు, టాపప్‌ కార్డులు, ఇతర కార్డుల అవసరం లేకుండా కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విఒఐపి అప్లికేషన్లు కాల్స్‌ కోసం ఇంటర్నెట్‌ డేటాను వినియోగించుకుంటాయని, తమ యాప్‌ మాత్రం ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తుందని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ringo  Windows  VoIP  Networks  Apple  android  

Other Articles