'Pyaasa, Kaagaz ke Phool scripts were conceived at Cafe Madras'

Cafe madras rings in 75th anniversary with 1940 rates

Cafe Madras rings in 75th anniversary with 1940 rates, madras cafe, madras cafe anniversary, madrad cafe matunga, madras cafe rates, 1940 rates, mumbai news

The popular items on the menu in 1940 were idli, upma and the Madras Cafe filter coffee which has truly stood the test of time.

క్యా బాత్ హై..! 1940 ధరలతో కస్టమర్లకు అల్పాహారం..!!

Posted: 11/27/2015 11:57 AM IST
Cafe madras rings in 75th anniversary with 1940 rates

ముంబైలోని మతుంగా మద్రాస్ కేఫ్. 1940లో తమ హోటల్ లో వున్న ధరలకే.. కస్టమర్లకు అల్పాహారం, టీ, కాఫీలను అందించింది. అదేంటని సుమారుగా ముప్పాతికేళ్ల ధరలకు ఇప్పుడు సరుకులు ఎలా వస్తాయి.. ఆ ధరలలో ఎలా అల్పాహారం తదితరాలను ఎలా వండి వారిస్తున్నారని అలోచిస్తున్నారా..? ఇలా చేసింది కేవలం ఒక్క రోజున మాత్రమే. అదీ ఎందకంటే.. ఈ కేఫ్ ఇటీవలే 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ కేఫ్‌కు వచ్చే వాళ్లకు ఈ సందర్భం గుర్తుండిపోయేలా చేశారు దాని నిర్వాహకులు.

అప్పటి ధరలను ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారనేగా మీ సందేహం. ఎందుకంటే ఇక్కడి కస్టమర్ల నోటికి తగ్గ రుచితో చేసిన వంటకాలను అందిస్తున్న ఈ హోటల్ ప్రారంభించింది 1940లోనేనట. అందకనే కేఫ్ ప్రారంభమైన సమయంలో తినుబండారాలు ఏ ధరకు అందించారో.. 75 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వాటిని అవే ధరలకు అందించారు. ఉప్మా కేవలం 40 పైసలకు, ఫిల్టర్ కాఫీని పదిహేను పైసలకు అందించారు. ఇవేగాక ఈ మద్రాస్ కేఫ్‌లో దక్షిణాది స్పెషల్స్ అయిన రసం, బటర్ ఇడ్లీ, దోసె, అప్పలం, మైసూర్ పాక్ వంటి వాటిని కూడా 1940 నాటి ధరలకు అందించారు. తమ రెస్టారెంట్‌కు వచ్చిన వారికి పాతధరలతో కొత్త అనుభవాన్ని ఇచ్చారు. అయితే ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమేనండోయ్..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madras cafe  hotel anniversary  special offers  1940 rates  mumbai  

Other Articles