Kerala bus depot officials say it is ayudha puja

Puja to scare away ghosts

Puja to scare away ghosts?, puja held at the state bus terminus depot, Kerala, drive away evil spirits, Kerala State Transport Corporation KSRTC, Antony Chacko, Chairman and Managing Director, KSRTC, Executive Director (Vigilance), Ayudha Puja

Controversy is brewing over a puja held at the state bus terminus depot in this northern most district of Kerala with allegations that the ritual was held allegedly to drive away evil spirits.

తిష్టవేసుకుని కూర్చున్న.. ‘వాటిని’ తరిమేందుకు పూజలు

Posted: 11/25/2015 05:26 PM IST
Puja to scare away ghosts

కేరళ. రాష్ట్రం. పకృతి తన కోసం తాను నిర్మించుకున్న రాష్ట్రం అని పేరుగాంచింది. అదే తరహాలో అక్కడ ఇప్పటికీ అయుర్వేద, కళరా. నృత్యం, సహా అన్ని పలు కళలకు సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం. అంతేకాదు వాటిని ఆచరించే వారి సంఖ్యకూడా అక్కడే అధికం. అయితే అక్కడ ఓ విచిత్రం జరిగింది. ఓ సర్కారీ బస్సు ఢిపోలో తిష్టవేసుకుని కూర్చుందని భావిస్తున్న దెయ్యాని తరిమేందుకు క్షుద్రపూజలు నిర్వహించారు.

ఈ ఘటన కాసర్ గోడ్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ అధికారంలో ఉన్నది వామపక్షాల కూటమి ప్రభుత్వమే అయినా.. దెయ్యాలను తరిమేసేందుకు పూజలు నిర్వహించారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో.. ఎక్కడలేని వివాదం మొదలైంది. కేఎస్‌ఆర్టీసీ డిపోలో అక్టోబర్ 22న ఈ తాంత్రిక పూజలు జరగడంతో.. ఎవరో వాటిని వీడియో తీశారు. అది కాస్తా ఇప్పుడు బయటపడి, టీవీ చానళ్లలో కూడా ప్రసారమైంది. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ (విజిలెన్స్)ను ఆదేశించినట్లు కేఎస్ఆర్టీసీ సీఎండీ ఆంటోనీ చాకో తెలిపారు.

అయితే అధికారులు మాత్రం భిన్నమైన కథనం వినిపిస్తున్నారు. అది క్షుద్రపూజ కాదని.. ఆయుధపూజ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. అలాగే, అది కేవలం అక్కడి ఉద్యోగులు చేసిందే తప్ప.. ఆర్టీసీకి దాంతో సంబంధం లేదని, ఆయుధ పూజలను తాము ఆపలేమని అన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి కూడా ఆ పూజలు జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లు చెప్పగా.. పూజ సమయంలో సాధారణంగా అధికారులందరూ కూడా పాల్గొంటారని చెబుతున్నారు. తరచు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటికి కారణం డిపోలో ఉన్న దెయ్యాలేనని ప్రచారం జరగడంతో వాటిని తరిమేసేందుకే ఆ పూజలు చేయించామని..

అవి కూడా జిల్లా రవాణా అధికారి సమక్షంలోనే జరిగాయని ఆర్టీసీ ఉద్యోగి ఒకరు తన పేరు బయట పెట్టొద్దంటూ చెప్పారు. అది ఆయుధపూజ కానే కాదని.. ఓ తాంత్రికుడితోనే చేయించామని అన్నారు. దీంతో నిజనిర్థారణ చేసకునేందుకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే కార్మికులందరూ ఏకతాటిపై వుండి అది ఆయుధపూజ అంటే ఏవరు మాత్రంఎంత విచారించినా.. నిజం నిగ్గు తేలానా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ghosts in rtc depot  puja to scare ghosts  kerala rtc depot  

Other Articles