Telangana TDP leader Raventh Reddy supports KCR statements

Telangana tdp leader raventh reddy supports kcr statements

Revanth Reddy, KCR, Revanth Reddy Vs KCR, Oppositions, Revanth Reddy statements, Revath Reddy comments, Revanth Reddy slams KCR

Telangana TDP Working President Revanth Reddy also support the KCR statments. KCR said that opposition leaders no need to pick personal issues in politics.

కేసీఆర్ మాటలతో ఏకీభవించిన రేవంత్ రెడ్డి

Posted: 11/25/2015 04:12 PM IST
Telangana tdp leader raventh reddy supports kcr statements

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ స్టేట్ మెంట్స్ తో ఏకీభవించారు. అవును మీరు చదవుతున్నది నిజమే.. కేసీఆర్ మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి ఊ కొట్టారు. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారేమో తాజాగా వరంగల్ ఎన్నికల తర్వాత ఫలితాల మీద మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు వ్యక్త గత విమర్శలకు దూరంగా ఉండాలని హితవుే పలికారు.  వ్యక్తిగత విమర్శలు వద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఒకరినొకరు వ్యక్తిగతంగా నిందించుకునే పద్దతిని ప్రారంభించిందే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్ ను , కొప్పుల ఈశ్వర్ ను తాను ఏనాడూ వ్యక్తిగతంగా దూషించలేదని రేవంత్ వెల్లడించారు. ఇక వరంగల్ లోక్ సభ ఉపఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ కట్టబెట్టడం ద్వారా.. ప్రజలు కేసీఆర్ పై మరింత భారం పెంచారని రేవంత్ అభిప్రాయపడ్డారు.

వరంగల్ ఎన్నికల్లో ఓడిస్తే.. ప్రజా సంక్షేమాన్ని మొత్తానికే వదిలేస్తారేమోననే ఆలోచనతోనే వరంగల్ ఓటర్లు టీఆర్ ఎస్ను గెలిపించారని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని కానీ వాటిని నిజం చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదని కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు, బలిదానాలు చేసిన వారి తరఫున మాట్లాడితే అది తప్పా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చీప్ లిక్కర్ మీద ప్రశ్నించడం కూడా తప్పా అని నిలదీశారు. కాగా మీడియా మీద, ప్రతిపక్షాల మీద నెపాన్ని నెట్టడం కరెక్ట్ కాదని హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles