Congress wrests back Ratlam in Madhya Pradesh from BJP in by-election, its tally goes up to 45 in Lok Sabha

Congress wrests back ratlam in mp from bjp

BJP, congress, Dilip Singh, Kantilal Bhuria, Ratlam Lok Sabha constituency, Madhya Pradesh, Telangana, TRS, TDP-BJP alliance, paunuri dayakar, Warangal Lok Sabha constituency, ruling party wins in Telangana

The tribal dominated Ratlam Lok Sabha constituency in Madhya Pradesh has given reasons to the Congress to cheer with the party winning back the seat from the Bharatiya Janata Party in a by-election.

బీజేపికి బీహార్ ఫలితాల తరువాత మరో షాక్..

Posted: 11/24/2015 05:06 PM IST
Congress wrests back ratlam in mp from bjp

దేశంలో గత ఏడాది వచ్చిన సార్వత్రిక ఎన్నికల సమయంలో యావత్ దేశాన్ని నమో మంత్రంతో సమ్మోహనం చేసుకున్న కమలనాథులకు ఆ తరువాత నుంచి రమారమి ప్రతికూల పవనాలే వస్తున్నాయి. ఆ తరువాత ఆరుమాసాలకే దేశరాజధానికి వచ్చిన ఎన్నికలలో నమో మంత్రి కనిపించనూ లేదు. వినిపంచనూ లేదు. ఆ తరువాత అక్కడక్కడా అధికారం చేపట్టినా.. వాటిలో చత్తీస్గడ్ మినహా ఎక్కడా అధికారం స్వతహాగా అందుకోలేదు. అన్ని చోట్ల మిత్రపక్షాలతో కలిసి.. అధికారం ఒక్క అధికారం పంచుకోవాల్సి వచ్చింది.

ప్రధాని మోడీ సహా కమలనాథులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భీహార్ ఎన్నికలలో బీజేపి ఘోరపరాజయం చవిచూసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని వరుస వైఫల్యాలు పలకరిస్తున్నాయి. తాజాగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా బీజేపికి షాక్ ఇచ్చాయి. అటు మధ్యప్రదేశ్లో రత్లాం లోక్ సభ నియోజక వర్గం, ఇటు తెలంగాణలోని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు ఓటమిని చవిచూశారు. మధ్యప్రదేశ్ లో అధికార బిజేపీ పార్టీకి చెందిన లోక్ సభ సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంతిలాల్ భురియ కైవసం చేసుకున్నారు. రత్లాం నుంచి ఆయన విజయం సాధించాడు.

అంతకుముందు బీజేపీ అభ్యర్థి అక్కడ అధికారంలో ఉండగా అతడు చనిపోవడంతో ఈ ఉప ఎన్నికల జరిగింది. అలాగే మిజోరంలోని థోంగ్జూ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అలాగే, తెలంగాణలోని వరంగల్ ఎంపీ స్థానంకోసం జరిగిన ఉప ఎన్నికలో విజయం అధికార టీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఇక రాజస్థాన్ లోని దేవాస్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి గాయత్రీ రాజే ప్రస్తుతం 20 వేల ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మణిపూర్ లో రెండు అసెంబ్లీ స్థానాలు బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  congress  Dilip Singh  Kantilal Bhuria  by polls  

Other Articles