us teens family seeks usd 15 mn in clock incident by seema hakhu kachru

Ahmed mohamed seeking 15 million in damages

ahmed, mohamed, clock, irving, school, district, lawsuit, demands, $15 million, Houston, Ahmed Mohamed, Texas teenager, homemade clock, USD 15 million, compensation

Ahmed Mohamed sent letters to both the city of Irving and the Irving School District demanding apologies and $15 million in damages.

అవమానానికి వందకోట్ల ఖరీదు.. అగ్రరాజ్యానికి షాకిచ్చిన బాలుడు తెలిలితేటలు

Posted: 11/24/2015 12:15 PM IST
Ahmed mohamed seeking 15 million in damages

తనను అరెస్టు చేసి అవమానించిన వారు దాదాపు రూ.వందకోట్లు (రూ.99,54,81,179.1)-(15 మిలియన్ డాలర్లు)) చెల్లించాలని, లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఎనిమిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ డిమాండ్ చేశాడు. అమెరికాలోని టెక్సాస్ లోని ఓ పాఠశాలలో  ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడు సొంత తెలివి తేటలతో అలారం గడియారాన్ని తయారు చేసి స్కూల్ కి తీసుకురాగా దానిని బాంబు అనుకొని భ్రమపడి ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఆ విద్యార్థి ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యాడు.

ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ఆ బాలుడి తెలివి తేటలకు ముగ్దులై అతడిని కలిసేందుకు ఆహ్వానించారు. వైట్ హౌస్ ఇప్పటికే అతడిని సత్కరించింది. అయితే, ఈ విద్యార్థి తెలివితేటలకు అబ్బురపడిన ఖతార్ లోని ఓ ముస్లిం ఫౌండేషన్.. అతనిని చదివించేందుకు ముందుకు రావడంతో అతడు త్వరలో అక్కడికి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసిన ఇర్వింగ్ సిటీ పోలీసులు, మేయర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు.

దాంతో పాటు పది మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా చెల్లించాలని కూడా డిమాండ్ చేసి తనకు అలారం గడియారం రూపోందించడంలోనే కాదు  అగ్రరాజ్య పోలీసు అధికారులను కూడా ఇబ్బందుల్లోకి నెట్టగల తెలివితేటలు వున్నాయిన నిరూపించాడు. తనను తప్పుగా అర్థం చేసుకొని ఓ ముస్లిం విద్యార్థి పట్ల వివక్ష చూపించారని ఆరోపిస్తూ ఐదు మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా చెల్లించడంతో పాటు తనకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆ విద్యార్థి తరుపు న్యాయవాది సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahmed Mohamed  Texas teenager  homemade clock  USD 15 million  compensation  

Other Articles