odisha court sentences five accused to death for gang rape and murder of minor

Five sentenced to death for gang raping murdering minor in odisha

Five accused, death sentence, gang rape, minor girl, odisha district sessions court, Gang Rape, Keonhjar District, Odisha Court, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

A court in Odisha on Monday awarded the death sentence to five people in connection with the gang-rape and murder of a minor girl in Keonhjar district in 2012.

ఒడిశా కోర్టు సంచలన తీర్పు.. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఐదుగురికి ఉరి..!

Posted: 11/24/2015 12:17 PM IST
Five sentenced to death for gang raping murdering minor in odisha

మైనర్ బాలికపై అత్యాచారం, అపై హత్య చేసిన కేసులో ఒడిశాలోని జిల్లా సెషన్స్ కోర్టు  సంచలన తీర్చు వెలువరించింది. దేశ రాజధానిలో నిర్భయ ఘటనకు పాల్పడిన దోషులకు ఫాస్ట్ ట్రాకు కోర్టు వెలువరించిన తీర్పునే.. ఒడిషాలో చోటుచేసుకున్న ఘటనలో స్థానిక సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించింది. ఒడిషాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో దోషులుగా నిర్ధారించిన ఐదురుగురికి   ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాటా ముండా, మంగల్ ప్రుస్తి, జతేన్ ముండా, హజ్రిత్ సింగ్ , బిశ్వనాథ్ ముండా లను కోర్టు దోషులుగా తేల్చింది.  
బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించినవారికి మరణదండనే సరైనదని వ్యాఖ్యానించింది.   ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు  ఇప్పటికీ  పరారీలోనే ఉన్నారు. కాగా 2012  ఆగస్టులో బేలాకుండి  బార్బిల్ గ్రామానికి చెందిన  ఎనిమిదవ తరగతి విద్యార్థినిని ఎత్తుకెళ్లిన  ఏడుగురు వ్యక్తులు  సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు.   ప్రైవేటుకు వెళ్లిన  కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ మరునాడు స్థానిక అటవీ ప్రాంతంలో బాలిక  మృతదేహాన్ని  కనుగొన్నారు.  అయితే  కింది కోర్టు  తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు నిందితుల తరపు న్యాయవాది తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Five accused  death sentence  gang rape  minor girl  odisha district sessions court  

Other Articles