Ramgopal varma attacks Amir Khan on his statements about intolerance

Ramgopal varma attacks amir khan by tweets

Ram Gopal Varma, am Gopal Varma statements, Ram Gopal Varma Tweets, Intolerance, India, Amir Khan, Anupam Kher, Amir Khan on Intolerance

Amir Khan contraversial statements on Intolerance in India. He said that his wife want to move from the country. Ramgopal Varma slams Amir. he said that people accepting three muslims as stars in Hindu majority country.

అమీర్ కు తలంటిన రాంగోపాల్ వర్మ

Posted: 11/24/2015 11:35 AM IST
Ramgopal varma attacks amir khan by tweets

తన బార్య దేశం వదిలివెళ్దామని అందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల మీద దుమారం రేగుతోంది. మరో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అమీర్ వైఖరిని తప్పు పట్టారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అయితే తాజాగా వివాదాల కేరాఫ్, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అమీర్ మీద మండిపడ్డారు. అసహనంపై అమీర్, ఇతర మేధావుల స్పందనపై వర్మ తీవ్రస్థాయిలో స్పందించారు.

హిందూ మతం మెజార్టీగా ఉన్న భారత్‌లో అమీర్‌ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు అతిపెద్ద స్టార్లుగా కొనసాగుతున్నారు... వీరు ముగ్గురు ముస్లీంలే. ముగ్గురు ఖాన్‌లు స్టార్లుగా కొనసాగడమే ప్రజల సహనానికి నిదర్శనం... దేశంలో మరి అసహనం ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు...  అసహనంపై కొందరు ప్రముఖులు ఫిర్యాదు చేస్తున్నరు. గుర్తించతగని విషయాలను అసహనానికి ప్రతీకగా తీసుకోకూడదు...  సమాకాలీన అంశాలపై డ్రాయింగ్ రూం చర్చల ద్వారా వారి పాపులారిటీ పెరుగుతుందేమో కానీ స్టార్ల స్పందనతో మతాల మధ్య అంతరం మాత్రం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదు చేసే వారిలో ప్రముఖులుగా పిలువబడేవారు చివరలో ఉండాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh