President's Son Abhijit Mukherjee Helps Accident Victim

Prez pranab mukherjee son helps accident victim

President of India, President Pranab Mukherjee, MP Abhijit Mukherjee, accident victim, Burdwan, Road Transport, Abhijit Mukherjee, Autos, Buses, Taxis, Trucks, Rickshaws etc, Accidents, MPs - Members of Parliament, National, Pranab Mukherjee, West Bengal, News

President Pranab Mukherjee's son and MP Abhijit Mukherjee today helped an accident victim in Burdwan district to reach hospital and later arranged for her quick shifting to another hospital, district officials said.

దేశాధ్యక్షుడి కుమారుడి సేవాతత్పరత.! ప్రమాదబాధితురాలిని సాయం చేసిన నేత..!!

Posted: 11/24/2015 11:21 AM IST
Prez pranab mukherjee son helps accident victim

రోడ్డు ప్రమాదానికి గురై, తల పగలి రక్తమోడుతున్న మహిళ.. టూ వీలర్‌ నడుపుతున్న ఆమె కుమారునికి పెద్దగా గాయలేమీ తగలలేదు. కానీ షాకింగ్‌లో ఎటూ పాలుపోని స్థితి అతనిది! ఇంతలో ఆ వైపుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆ మహిళను ఆస్పత్రికి చేర్చాడు! తర్వాత మరింత మెరుగైన వైద్యం కోసం దగ్గరుండి మరో ఆస్పత్రికి మార్పించాడు! ఆ వ్యక్తి ఎవరో కాదు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు, ఎంపీ అభిజిత్ ముఖర్జీ! పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్‌వాన్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన బాధితురాలి పట్ల అభిజిత్ ముఖర్జీ ప్రదర్శించిన మానవత్వం, సమయస్ఫూర్తి ఫలితంగా ఆమెకు పెనుప్రమాదం తప్పింది.

సుమితాపాల్‌ అనే నడివయస్కురాలు తన కుమారుడు ఆర్ఘ్యతో కలిసి బుర్ద్‌వాన్‌ నుంచి బైక్‌పై గుస్కారలోని గుడికి వెళుతున్నవేళ మరో టూ వీలర్‌ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సుమితాపాల్‌ తలకు పెద్ద గాయమై, క్షణాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇంతలో ఆవైపుగా వెళుతున్న అభిజిత్ ముఖర్జీ తన వాహనాన్ని ఆపి పరిస్థితి చూసి చలించిపోయారు! బాధితురాలిని హుటాహుటిన తన వాహనంలో ఎక్కించుకొని గుస్కారాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ అస్పత్రి వైద్యుల సూచన మేరకు బుర్ద్‌వాన్‌లో మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

ఇందు కోసం అభిజిత దగ్గరుండి ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించారు. అంతేకాదు.. ఖర్చుల కోసం బాధితురాలి కుమారుడు ఆర్ఘ్యకు కొంత డబ్బు కూడా ఇచ్చారు. అభిజిత్ అంతటితో ఊరుకోలేదు.. జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్రా మోహన్‌కు ఫోన్‌ చేసి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ‘‘అభిజిత్ బాబు గనక అక్కడ లేకుంటే, ఏం జరిగేదో, తలచుకుంటేనే భయంగా ఉంది. అమ్మకు చికిత్స కచ్ఛితంగా ఆలస్యమయ్యేదే’’ అని ఆర్ఘ్య కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President Pranab Mukherjee  MP Abhijit Mukherjee  accident victim  

Other Articles