వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేలిపోయింది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసనూరి దయాకర్ గెలుపుకు ఎలాంటి ఢోకా లేదు. వరంగల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుకు ఎదురులే్కుండా పోయింది. కడియం శ్రీహరి రాజీనామా తర్వాత వరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కారు మంచి జోరు మీదుంది. పార్టీ అభ్యర్థి దయాకర్ దాదాపు రెండున్నర లక్షల లీడ్ లో కొనసాగడంతో గులాబీ గూటిలో కొత్త కళ వచ్చింది. ఇక మిగిలిన అభ్యర్థుల విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ కాస్త నయం అనిపిస్తున్నారు. గులాబీ అభ్యర్థిని అందుకునే రేంజ్ కాకపోయినా కానీ కాస్త బెటర్ అనిపించేలా ఉన్నారు. ఇక టిడిపి, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి దేవయ్య పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీ పార్టీకి ఎన్ని ఓట్లు అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
Also Read: ఓరుగల్లులో కారు జోరు
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దయాకర్ గెలుపు ఖాయమైపోయింది. కాగా ఎంత మెజార్టీతో గెలుస్తారు అన్నది అందరికి ఆసక్తికరంగా మారింది. గతంలో కన్నా పోలింగ్ శాతం తగ్గినా కానీ టిఆర్ఎస్ కు వచ్చే మెజారిటీ విషయంలో ఇంకా మంచి ఫలితాలే వస్తాయని అందరూ ఊహిస్తున్నారు. కడియం శ్రీహరి కన్నా కూడా భారీ మెజార్టీ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మిగిలిన పార్టీల నాయకులు కనీసం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో మెజార్టీ దాదాపు రెండు లక్షల పైచిలుకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కొద్ది సేపట్లో వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు.. పూర్తి వివరాలతో సహా బయటకు వస్తాయి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more