Anupam Kher questions Aamir Khan's statement on intolerance

Anupam kher questions aamir khan s statement on intolerance

Amir Khan, Anupam Kher, intolarence, India, Modi, Intolarence in India, Anupam Kher on Amir Khan

He Twitter feed is full of opinions that he has about the goings-on in the country. The issue of intolerance and the resulting comments on the same has piqued his interest and he takes on the comments on his Twitter page too.

అమీర్ ఖాన్ ఇది కరెక్ట్ కాదు.. ఏం చెప్పాలనుకున్నావు..?

Posted: 11/24/2015 10:51 AM IST
Anupam kher questions aamir khan s statement on intolerance

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ దేశంలో పెరుగుతున్న అసహనం మీద చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అమీర్ ఖాన్ దేశంలో పెరుగుతున్న అసహనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. తన బార్య కిరణ్ ఏకంగా దేశం విడిచి వెళ్దామని కూడా తనతో అన్నట్లు అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే దీని మీద దేశంలో అప్పుడే నిరసనలు మొదలయ్యాయి. గతంలో షారుఖ్ ఖాన్ కూడా అసహనం మీద తీవ్రంగా స్పందించారు. కాగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యాల మీద ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తన సలహాలను అందించారు. గతంలో ఇంక్రిడెబిల్ ఇండియా కాస్తా ఆరు, ఏడు నెలల్లో అప్పుడు ఇంటోలరెంట్ ఇండియాగా మారిందా అంటూ వ్యాఖ్యానించారు. అయినా దేశం విడిచివెళదామన్న మీ బార్యకు ఇండియా గురించి చెప్పారా అని ప్రశ్నించారు.


Also Read: భయపడుతున్న అమీర్ ఖాన్ భార్య

అమీర్ ఖాన్ మీరు.. భరోసా ఇవ్వాలి కానీ భయాన్నివ్వ కూడదు అని అనుపమ్ ఖేర్ అమీర్ కు సూచించారు. అయినా మీరు ఇండియన్స్ కు ఏం చెప్పదలుచుకున్నారు..? ఇండియా నుండి వెల్లిపొమ్మనా..? లేదా పరిస్థితులు చక్కబడేవరకు వేచి చూడమనా అని అన్నారు. అమీర్ ఖాన్ మీరు దేశంలో ఇంత కన్నా దుర్భరమైన పరిస్థితుల్లో ఇక్కడే ఉన్నారు కానీ అప్పుడు ఎప్పుడూ దేశం విడిచివెళ్లాలని ఆలోచించలేదే..? అమీర్ ఖాన్ మీ భార్య ఏ దేశానికి వెళ్దామని అంటోంది అడిగారా...? అయినా ఈ దేశం మిమ్మల్ని తయారు చేసిందన్న విషయాన్ని ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారా..? అని అమీర్ ను నిలదీశారు అనుపమ్ ఖేర్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amir Khan  Anupam Kher  intolarence  India  Modi  Intolarence in India  Anupam Kher on Amir Khan  

Other Articles

Today on Telugu Wishesh