Wife Even Suggested Leaving India Says Aamir Khan

Wife even suggested leaving india says aamir khan

Aamir Khan, Intolerance, India, Modi, NDA, Intolerance in India, Aamir Khan on Intolerance, Sharukh Khan, Aamir Khan News

Actor Aamir Khan today joined the debate on the growing 'intolerance' and said he has been "alarmed" by a number of incidents, and that his wife Kiran Rao even suggested that they should probably leave the country. "As an individual, as part of this country as a citizen, we read in the papers what is happening, we see it on the news and certainly, I have been alarmed. I can't deny. I have been alarmed by a number of incidents," Mr Khan said while speaking at the Ramnath Goenka Excellence in Journalism Awards.

భయపడుతున్న అమీర్ ఖాన్ భార్య

Posted: 11/24/2015 08:03 AM IST
Wife even suggested leaving india says aamir khan

దేశంలో పరిస్థితులు తన భార్యకు ఆందోళన కలిగిస్తున్నాయని అమీర్ ఖాన్ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ దేశంలో చోటుచేసుకున్న అసహనం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా అసహనం పెరిగిందంటూ చాలా మంది ప్రముఖులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎంతో మంది మేధావులు తమ అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చేశారు. తాజాగా మరోసారి అమీర్ ఖాన్ మాటలతో అగ్గికి ఆజ్యం తోడైనట్లైంది.

దేశంలో పెరుగుతున్న అసహనంపై నిరసన తెలియజేస్తున్న బాలీవుడ్ ప్రముఖుల్లో ఆమిర్‌ఖాన్ కూడా చేరిపోయారు. అసహన ఘటనలు పెరుగుతుండటం తనను ఆందోళనకు గురిచేసిందని అన్నారు. దేశం విడిచిపెట్టే పోదామని తనభార్య కిరణ్‌రావు సూచించిందని కూడా చెప్పారు. దేశంలో ఏం జరుగుతున్నదో పేపర్లు, టీవీవార్తల ద్వారా తెలుసుకున్నప్పుడు తనకు ఆందోళన కలిగిన మాట వాస్తవమని చెప్పారు. గత ఆరు లేదా ఎనిమిది మాసాల నుంచి జరుగుతున్న ఘటనలు తనలో ఉద్రిక్తత కలిగించాయని అన్నారు. ఇంటిదగ్గర కిరణ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆమె మనం ఇండియా వదిలిపెట్టిపోవాలా అనేది. కిరణ్ నోటివెంట ఇలాంటి పెద్దపెద్ద మాటలు రావడం ఉత్పాతం కిందే లెక్క. ఆమె తనబిడ్డ గురించి ఆందోళన చెందుతున్నది. రేపు మనచుట్టూ వాతావరణం ఎలా ఉంటుదనేది ఆమె భయం. పొద్దున పత్రికలు తెరవాలంటేనే గజగజ వణకిపోతున్నది అని ఆమిర్ చెప్పుకొచ్చారు. కేవలం ఆందోళనే కాదు మనసులో పెరుగుతున్న అలజడికి, నిస్సహాయ భావనకు ఇది సంకేతమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles