Central Home Ministry issue warning to state for Terror attacks

Central home ministry issue warning to state for terror attacks

Terror, Terror Attack, Terrorists, IB, Home Minister, Terror attack on India, India, Lashkar-e-thaiba

central Home ministry alarm on terror attack on India by Lashkar-e-thaiba group. In Metro cities like Mumbai, delhi, Bengaluru, Chennai, Terrorists may attack.

హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం

Posted: 11/24/2015 08:31 AM IST
Central home ministry issue warning to state for terror attacks

కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడులు జరగవచ్చుననే అనుమానంతో కేంద్ర హోం శాఖ హెచ్చరిక నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పాత బస్తీలో పలు చోట్ల పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. చాంద్రాయణగుట్ట, బాబానగర్, ఫలక్‌నూమా ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాత బస్తీ, చుట్టు పక్కలి ప్రాంతాల్లో దాదాపు 500 మంది పోలీసులు కార్టాన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితులను తమ అదుపులోకి తీసుకొని వివరాలను ఆరా తీస్తున్నారు. ప్యారిస్ ఘటన తర్వాత ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడులకు పాల్పడవచ్చునని కేంద్రం ముందే ఊహించగా... పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న లష్కరే తోయిబా నుండి ముప్పు ఉందని సమాచారం అందడంతో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

ఉగ్రవాదుల నెట్‌వర్క్‌పై ఉన్న సమాచారంతో హైదరాబాద్‌తో పాటు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాలపై దాడులు జరగవచ్చని పేర్కొంది. అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న లష్కరేతాయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాదులు దేశంలోని మెట్రోనగరాలను టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో బహిరంగ ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, కీలకమైన భవనాలు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఉగ్రవాదులు మరోసారి నవంబర్ 26నే విరుచుకుపడే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయా రాష్ర్టాల భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. స్లీపర్ సెల్స్, ఉగ్రవాద సానుభూతిపరులపై పటిష్ఠ నిఘా పెట్టాలని సూచించింది. నాకాబందీ, రాత్రి పూట తనిఖీలను ముమ్మరం చేయాలని పేర్కొంది. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలను పూర్తిగా జల్లెడ పట్టాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terror  Terror Attack  Terrorists  IB  Home Minister  Terror attack on India  India  Lashkar-e-thaiba  

Other Articles