ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీ మీద మాటల దాడికి దిగారు. దేశాలు తిరుగుతూ మోదీ అసలు దేశ ప్రజల గురించి మరిచిపోయారని విమర్శించారు రాహుల్. దేశాధినేతలతో, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలతో కలిసి సెల్ఫీలు దిగే మోదీ.. ఎన్నడైనా రైతులతో కలిసి సెల్ఫీ దిగాడా..? అంటూ ప్రశ్నించారు. రైతులకు భరోసాగా తామున్నామని... కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి, రైతులకు, రైతు కూలీలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇక లోకసభ ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన అచ్చే దిన్ నినాదం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అచ్చే దిన్ అన్న మాట వింటేనే జనాలు నవ్వుకుంటున్నారని.. రైతుల గురించి పట్టించుకోకుండా అచ్చే దిన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు మోదీ.. అచ్చే దిన్ తీసుకువస్తానని చెప్పి.. ఇప్పుడు మాత్రం దేశాలు తిరుగుతున్నారని విమర్శించారు రాహుల్. అలాగే దేశంలో రైతులు, రైతు కూలీలు, గిరిజనులు, అణగారిన వర్గాలకు ఎప్పటికైనా అండగా నిలిచేది.. గతంలో నిలిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మోదీ ఫ్లైట్లో ఇంగ్లండ్ కు వెళితే తాము మాత్రం రైతుల కోసం పొలాల బాట పట్టామని రాహుల్ గాంధీ వెల్లడించారు. అచ్చే దిన్ కేవలం నినాదాల్లో కాకుండా.. రైతులకు, దళితలకు, రైతు కూలీలక రావాలని అది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే సాధ్యపడుతుందని వివరించారు. మొత్తంగా రాహుల్ గాంధీ మరోసారి మోదీ మీద మండిపడుతూ.. జనాల నుండి సింపథీ కొట్టివేయాలని చూస్తున్నారు చూడాలి మరి రాహుల్ గాంధీ ఎంత వరకు సక్సెస్ అవుతారో?
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more