Four women Maoists killed in encounter

Four women maoists killed in encounter

Sukma, Dantewada, Chhattisgarh, maoists, naxals, Encounter, Encounter in Chhattisgarh

The bodies of four alleged women Maoists were recovered after a gun battle between Maoists and security forces along the border of Sukma and Dantewada districts in Chhattisgarh, state police said. Senior police officers claimed that Aaytu — a divisional commander of the Darbha division of Maoists — was injured in the firing, but was rescued by his accomplices

ఎన్ కౌంటర్ లో నలుగురు మహిళా నక్సలైట్ల మృతి

Posted: 11/23/2015 08:07 AM IST
Four women maoists killed in encounter

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ సుకుమా, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమా చారంతో సుకుమా, దంతెవాడ పోలీసులు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, సిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్‌ పోలీస్‌ బలగాలు సంయుక్తంగా సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తూ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న క్రమంలో సుకుమా జిల్లా గాజిరాజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగల్‌ గూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కనిపిండంతో కాల్పులు చోటు చేసుకున్నాయి.

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య హోరా హోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులు మలంగీర్‌ ఏరియా కమిటీ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో సుకుమా, దంతెవాడ జిల్లాలకు చెందిన రామే, మాకే, సన్ని, పాండేభాయిలుగా గుర్తించి మృతదేహాలను స్వాధీన పర్చుకున్నారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో 303 రైఫిల్‌, 12బోర్‌ తుపాకులు 2, పేలుడు సామాగ్రి, కిట్‌ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sukma  Dantewada  Chhattisgarh  maoists  naxals  Encounter  Encounter in Chhattisgarh  

Other Articles