Nizamabad MP Kavitha fired on central govt

Nizamabad mp kavitha fired on central govt

central Govt, Kavitha, MP Kavitha, Nizamabad MP, Telangana, NDA Govt, Modi Govt, TRS Party

TRS Party MP Kavitha slams central Govt for not supporting telangana state. She said that central govt did give funds to any project or any programmee.

కేంద్రం తెలంగాణకు ఏమిచ్చింది..? ఎంపీ కవిత ఆగ్రహం

Posted: 11/23/2015 08:50 AM IST
Nizamabad mp kavitha fired on central govt

విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటై ఇన్ని నెలలవుతోన్న ఇంకా హైకోర్టు విభజన చేయలేదని ఆగ్రహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ హైకోర్టు విభజన అంశాన్ని ప్రస్తావించారని ఎన్నికలు అయిపోగానే అటకెక్కించారని మండిపడ్డారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి, బీజేపీ నేత కిషన్రెడ్డి హైకోర్టు విభజన ప్రస్తావనే తేవడంలేదన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల గురించి పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ లేక కష్టమవుతోందని అంటే సంవత్సరం తర్వాత చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కొంచెమైనా కేంద్రం సాయం చేసి ఉంటే బాగుండేదని కవిత పేర్కొన్నారు.

తెలంగాణకు ఏ విషయంలోనూ కేంద్రంనుంచి సహకారం అందడం లేదని, కనీసం పెండింగ్‌లో ఉన్న నిధులు కూడా ఇవ్వటం లేదని కవిత ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజల కోసం ఎంత భారమైనా లెక్క చేయకుండా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడితే ఏ ఒక్క పథకానికి కేంద్రం నిధులిచ్చిన పాపాన పోలేదన్నారు. మన ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇతర సౌకర్యాల కల్పనకు రూ.1.50 లక్షల ఖర్చు చేస్తున్నదని చెప్పారు. కేంద్రం నుంచి మన రాష్ర్టానికి సీఎస్‌టీ కాంపన్సేషన్ 6 వేలకోట్లు రావాల్సి ఉన్నా ఉలుకూ పలుకూ లేదన్నారు. సంక్షేమ పథకాలకు కేంద్రం సహకరించకపోగా తెలంగాణ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని, సకాలంలో ప్రతిపాదనలు పంపడంలేదని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central Govt  Kavitha  MP Kavitha  Nizamabad MP  Telangana  NDA Govt  Modi Govt  TRS Party  

Other Articles