Landslide Near Jade Mine in Myanmar Kills About 100

Landslide near jade mine in myanmar kills about 100

Myanmar, landslide in Myanmar, Myanmar News, Jade, Green stones, Viallagers for Green stones

A landslide near a jade mine in northern Myanmar killed about 100 people, most of them villagers digging for green stones in a mountain of displaced earth, a witness and a community leader said . Many other people were missing.

కొండచరియలు విరిగి వంద మంది మృతి

Posted: 11/23/2015 07:53 AM IST
Landslide near jade mine in myanmar kills about 100

మయన్మార్‌లోని కచిన్ జిల్లాలో ఘోర విపత్తు సంభవించింది. హెపకాంట్‌ లోని పచ్చరాయిగనుల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో వందమందికి పైగా మృతిచెందగా మరో వందమంది ఆచూకీ తెలియకుండా పోయింది. శిథిలాల నుంచి వంద మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన పచ్చరాయిని అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో కచిన్ ఒకటి. వందలమంది వలసకూలీలు అత్యంత ఖరీదైన పచ్చరాయిని సేకరించే పనిలో నిమగ్నమై ఉంటారు. కొండల పక్కనే గుడిసెలు వేసుకొని అక్కడే కాలం గడుపుతుంటారు.

ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగి గుడిసెలపైపడ్డాయి. ఆ సమయంలో కూలీలంతా గాఢనిద్రలో ఉండడంతో చాలామంది సజీవసమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడిన సమయంలో గుడిసెల్లో మైనర్లు అధికంగా నిద్రిస్తున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పచ్చరాయి గనుల సమీప గ్రామాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం అసాధారణమైన ఘటన అని, దీనిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Myanmar  landslide in Myanmar  Myanmar News  Jade  Green stones  Viallagers for Green stones  

Other Articles

Today on Telugu Wishesh