tejaswi yadav takes on critics says dont judge a book by its cover

Bihar deputy cm on critics dont judge a book by its cover

Tejaswi Yadav, Bihar Deputy Chief Minister, Nitish Kumar, RJD, Nitish Kumar,RJD,JD(U),Lalu Yadav,Tej Pratap Yadav,Bihar Deputy CM Tejaswi Yadav

With his appointment as Deputy Chief Minister in Bihar government drawing criticism, Rashtriya Janata Dal (RJD) chief Lalu Yadav's son Tejaswi Yadav today took on his detractors, asking them "not to judge a book by its cover

విమర్శకుల మనస్సు నోప్పించకుండా.. చురకలంటిని బిహార్ ఉప ముఖ్యమంత్రి

Posted: 11/22/2015 06:06 PM IST
Bihar deputy cm on critics dont judge a book by its cover

బిహార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనపై వస్తున్న విమర్శలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి ఆదివారం బదులిచ్చారు. విమర్శకుల మనస్సు నోప్పించకుండా.. చురకలంటి తన వయస్సు తక్కువైనా, తన పరిణితి మాత్రం ఉన్నతమైనదని చాటిచెప్పాడు. తన పనితీరు చూడకుండనే ముందే తీర్పు చెప్పడం సరికాదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'బ్రాండ్ బిహార్‌'ను మరింతగా పెంచి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గర్వకారణంగా తాను నిలుస్తానని ఆయన ప్రతిన బూనారు. బిహార్ ప్రజలు యువతపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముకాకుండా.. వారికి అభివృద్ధి ఫలాలు అందిస్తానని 26 ఏళ్ల తేజస్వి చెప్పారు.

'ముఖాన్ని చూసి ముందే అంచనాకు రాకూడదు. తీయని అమృతమైనా, చేదు ఔషధమైనా దాని ప్రభావాన్ని చూపించేందుకు కొంత సమయం తీసుకుంటుంది' అని తేజస్వి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తేజస్వి విద్యా అర్హతలు, రాజకీయ అనుభవంపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందిస్తూ 'మా కుటుంబంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాను. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో చూశాను. నాకు అనుభవం లేకపోవచ్చు కానీ ఏమీ తెలియని వాడినైతే కాను. నితీశ్‌ జీ నేతృత్వంలో ప్రభుత్వం పనితీరును ఇంకా బాగా నేర్చుకుంటాను. నేను అనర్హుడినని ఎలా అంటారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని నేను' అంటూ ఆయన విమర్శకులకు బదులిచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tejaswi Yadav  Bihar Deputy Chief Minister  Nitish Kumar  RJD  

Other Articles