Delhi to go 'Car-Free' on January 22: Arvind Kejriwal

Delhi celebrates second car free day on january 22

delhi, delhi car free day, arvind kejriwal, arvind kejriwal car free day, kejriwal car free day, car free day, kejriwal cycle rally, kejriwal jan 22 car free day, jan 22 car free day, delhi pollution, delhi latest news

Delhi Chief Minister Arvind Kejriwal today announced that his government will organise 'Car-Free Day' across the national capital on January 22, ..

ఆ ఒక్క రోజున శ్రీమంతుడుగా మారనున్న కేజ్రీవాల్..!

Posted: 11/22/2015 05:33 PM IST
Delhi celebrates second car free day on january 22

ఆ ఒక్క రోజున శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబులా మారనున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అదేంటి ఆయన కూడా ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారా అని అనుకుంటే పోరబాటే. ఆ ఒక్క రోజున ఆయన మహేష్ బాబులా సైకిల్ తొక్కుతూ తన ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే జనవరి 22న 'కార్ ఫ్రీ డే' కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తాను సైకిల్పై ఆఫీసుకు వెళతానని చెప్పారు.

ఆదివారం 'కార్ ఫ్రీ డే' భాగంగా ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. కేజ్రీవాల్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 'జవనర్ 22న ఉద్యోగులు కార్లలో బదులుగా సైకిళ్లు లేదా ప్రజా రవాణా వాహానాల్లో ఆఫీసులకు వెళ్లాలని విన్నవిస్తున్నా. ఆ రోజు నేను కూడా సైకిల్పై ఆఫీసుకు వెళతా. నా విన్నపాన్ని కనీసం 5-10 శాతం మంది పాటించినా అది మాకు గొప్ప విజయం' అని చెప్పారు. ఢిల్లీలో సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ప్రతి నెలా 22న ఒక్కో ప్రాంతంలో కార్ ఫ్రీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Car-Free Day  Arvind Kejriwal  

Other Articles